BRS No Bidding : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేసీఆర్ సర్కార్ బిడ్ వేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందిగా.. గులాబీ బాస్ కంగుతిన్నారా..!?

ABN , First Publish Date - 2023-04-21T13:44:28+05:30 IST

అవును.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను (Vizag Steel Plant) కాపాడుకుంటాం.. బిడ్ వేసి ప్రైవేటీకరణ (Privatization) ఆపుతాం.. ఒకటా రెండా.. పది రోజులపాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలంగాణ గులాబీ నేతల కామెంట్సే (BRS Leaders) హోరెత్తాయి. సీన్ కట్ చేస్తే...

BRS No Bidding : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేసీఆర్ సర్కార్ బిడ్ వేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందిగా.. గులాబీ బాస్ కంగుతిన్నారా..!?

అవును.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను (Vizag Steel Plant) కాపాడుకుంటాం.. బిడ్ వేసి ప్రైవేటీకరణ (Privatization) ఆపుతాం.. ఒకటా, రెండా.. పది రోజులపాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలంగాణ గులాబీ నేతల కామెంట్సే (BRS Leaders) హోరెత్తాయి. ఈ దెబ్బతో ఏపీలో బలపడాలి.. మొదటి విజయం ఇదే అని తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) కూడా భావించారు. అంతేకాదు.. బిడ్‌ దాఖలు చేస్తే విశాఖ ఉక్కు (Visakha Ukku) వ్యవహారం రాజకీయంగా తమకు కలిసి వస్తుందని, బీఆర్‌ఎస్‌ విస్తరణతో పాటు, ప్రధాని మోదీపై (PM Modi) యుద్ధానికి దీనినో అస్త్రంగా మలచుకోవచ్చని పెద్ద పెద్ద అంచనాలే వేసింది బీఆర్ఎస్. అంతేకాదు ఆ మధ్య కేంద్రమంత్రి చేసిన ఓ ప్రకటనతో బీఆర్ఎస్ దెబ్బతోనే కేంద్రంలోని మోదీ సర్కార్ (Modi Govt) వెనక్కి తగ్గింది. ఏపీలో ఇదే తొలి విజయం అని మున్ముందు ఏపీలో చాలా చాలా చేస్తామని బీఆర్ఎస్ ఓ రేంజ్‌లో గొప్పలు చెప్పుకున్నారు గులాబీ పార్టీ నేతలు. సీన్ కట్ చేస్తే అదేదో పాట ఉంది కదా.. ‘అంతన్నాడు.. ఇంతన్నాడే..’ అన్నట్లుగా అప్పటి వరకూ ఆహా.. ఓహో అని ఓ రేంజ్‌లో బిల్డప్‌లు ఇచ్చి బిడ్డింగ్ టైమ్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు. అన్నెన్ని మాటలు అన్న బీఆర్ఎస్ సడన్‌గా ఎందుకిలా గాయబ్ అయ్యింది..? తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య ఓ రేంజ్‌లో జరిగిన మాటల యుద్ధం సైలెంట్ అయ్యిందేంటి..? అసలు కేసీఆర్ మౌనం వెనుక ఆంతర్యమేంటి..? అసలు కేసీఆర్ వెనకడుగు వేయడానికి కారణాలు వేరే ఉన్నాయా..? ఈ మొత్తం వ్యవహారంపై సోషల్ మీడియాలో (Social Media) నెటిజన్లు.. రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

CM-KCR.jpg

బిడ్ వేయకపోవడం వెనుక..!?

నిన్న, మొన్నటి వరకూ స్టీల్ ప్లాంట్.. స్టీల్ ప్లాంట్ అంటూ తెగ హడావుడి చేసిన సీఎం కేసీఆర్‌.. బిడ్‌ ఎందుకు వేయకుండా మిన్నకుండిపోయారు!? ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న! నిజానికి, బిడ్‌ దాఖలు చేస్తే.. మూల ధనం సమకూర్చడానికి దాదాపు రూ.5,000 కోట్లు కావాలని అంచనా వేశారు. సింగరేణితో వేయించాలని ప్రణాళిక రచించారు. ఆ సమయంలోనే సింగరేణి (Singareni) ఆర్థిక సామర్థ్యంపై కథనాలు వచ్చాయి. రోజువారీ నిర్వహణకు, ఉద్యోగుల నెల జీతాల చెల్లింపులకు కూడా పక్క చూపులు చూడాల్సిన స్థితిలో సింగరేణి ఉందనే విశ్లేషణలు ఓ రేంజ్‌లో వచ్చాయి. ఏకంగా పది శాతం వార్షిక వడ్డీకి అప్పులు తెస్తోందని విమర్శలూ వెల్లువెత్తాయి. వీటన్నిటినీ సింగరేణి తీవ్రంగా ఖండించింది కూడా. అంతేకాదు.. తమ సంస్థకు వివిధ బ్యాంకుల్లో ఏకంగా రూ.11,665 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, వాటిపై ఏడాదికి వడ్డీయే రూ.750 కోట్లు వస్తాయని ప్రకటించింది. తన వార్షిక టర్నోవర్‌ దాదాపు రూ.33 వేల కోట్లని కూడా వెల్లడించింది. అంతటితో ఆగలేదు.. తమకు ఏటా లాభాల రూపంలోనే రూ.2000 కోట్లకుపైగా వస్తున్నాయని తెలిపింది. మరి ఇంత ఆర్థిక స్తోమత ఉన్న సింగరేణి విశాఖ ఉక్కు బిడ్‌ నుంచి ఎందుకు వెనక్కి తగ్గింది!? విశాఖ వెళ్లి అధ్యయనం చేసి వచ్చి కూడా లాభసాటి బిడ్‌ను ఎందుకు వదులుకుందన్న ప్రశ్నలకు జవాబులు లేవు. అయితే.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే బిడ్‌ నుంచి సింగరేణి వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Vizag-Steel-Plant.jpg

కారణాలు ఇవేనా..!?

కేసీఆర్ సర్కార్ ఎందుకు బిడ్ వేయలేదో అసలు విషయం తెలియట్లేదు.. అధికారికంగా బీఆర్ఎస్ కూడా ప్రకటించలేదు కానీ.. ఈ గ్యాప్‌లో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, బీఎస్పీ పార్టీలు మాత్రం ఓ రేంజ్‌లో ఇదంతా తమవల్లే అని గొప్పులు చెప్పుకుంటున్నాయి. వాస్తవానికి కేసీఆర్ సర్కార్.. స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడైతే ప్రైవేటీకరణను ఆపుతామని ప్రకటించిందో నాటి నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. తన ఇల్లు చక్కబెట్టుకోలేని వ్యక్తి పక్కింటి గురించి ఆలోచించడమేంటి..? ముందు మన సంగతి చూసుకోవాలి కదా..? అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రజలకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ముందు ఇక్కడి సమస్యలు పట్టించుకోండి మహాప్రభో అని ప్రజాసంఘాలు కూడా గగ్గోలు పెట్టాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ మాత్రం కేసీఆర్ సర్కార్ ప్రకటన చేసిన నాటి నుంచే కౌంటర్లు, విమర్శలతో ఈ వ్యవహారం కాస్త కారు పార్టీ వర్సెస్ కాషాయ పార్టీగా మారిపోయింది.

- సిర్పూర్ పేపర్ మిల్లు (Sirpur Paper Mill), అజంజాహి మిల్లు (Azam Jahi Mill), రేయాన్ ఫ్యాక్టరీలు (Rayons Factory), నిజాం షుగర్ ఫ్యాక్టరీలను (Nizam Sugar Factory) తెరిపిస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని కేసీఆర్ సర్కార్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తామని బీఆర్ఎస్ చెబుతుండటం ఆశ్చర్యమేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (TS BJP Chief Bandi Sanjay), జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి (Vijaya Shanthi) లాంటి వారు ఎద్దేవా చేశారు. తెలంగాణలో మూతపడిన సంస్థలను పునరుద్ధరించడం చేతగానీ కేసీఆర్ సర్కార్.. ఇలా కేంద్రంపై అబాంఢాలు మోపడం ఎంతవరకు సబబు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ మధ్య జరిగిన ప్రతి విషయాన్నీ లేవనెత్తి బీఆర్ఎస్‌ ఈ పని సక్రమంగా చేయలేకపోయింది కానీ.. స్టీల్ ప్లాంట్ బిడ్ వేస్తుందా..? అని ప్రశ్నలు వెల్లువెత్తాయి.

- ఇవన్నీ తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందనే ఆరోపణలూ లేకపోలేదు. ఆఖరికి ఆ మధ్య ఓ ఆస్పత్రిలో స్ట్రెచర్ లేక రోగిని ఆయన కుటుంబ సభ్యులే చెరో కాలు పట్టుకుని లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మీమ్స్ అయితే.. బాబోయ్ ఓ రేంజ్‌లో వచ్చాయి. తెలంగాణలో స్టీల్ కొరత.. ముఖ్యంగా స్ట్రెచర్లు లేవు కాబట్టి ఇక్కడ అన్నీ వదిలేసి ఏపీకి వెళ్లి మరీ స్టీల్ ప్లాంట్‌ బిడ్‌కు సిద్ధమయ్యామని హరీష్‌ను విమర్శిస్తూ మీమ్స్ వెల్లువెత్తాయ్.

- ఒక్క పరీక్షా పేపర్ లీక్ (TS Paper Leaks) కాకుండా పరీక్ష జరపలేరు కానీ.. స్టీల్ ప్లాంట్ తీసుకుంటారట.. ‘మాకు నమ్మకం లేదు దొర’ అని సినిమా డైలాగ్స్‌తో ఓ రేంజ్‌లో మీమ్స్, ఫన్నీ వీడియోలు నెట్టింట్లో పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. మరోవైపు.. ఏపీ నుంచి కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్లు వచ్చాయి.. ‘కేసీఆర్, కేటీఆర్ గారు, అమ్మకు అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడట!’ అంటూ ఏపీ కమలనాథులు కూడా సెటైర్ల వర్షం కురిపించారు.

- ఇలా అడగడుగునా కేసీఆర్‌కు ఇసుమంత కూడా సపోర్టు రాకపోగా.. అంతా వ్యతిరేకత రావడం.. పైగా ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా కమలనాథుల నుంచి వల్లే విమర్శల వల్లే కేసీఆర్ వెనకడుగు వేశారని బీజేపీ చెప్పుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా ఇదే చర్చకు లేవనెత్తుతోంది. ఇది అసలు సిసలైన విజయం అంటే అని బీజేపీ కార్యకర్తలు.. ధీమాగా నెట్టింట్లో చెప్పుకుంటున్నారు.

- ఎటూ చూసినా వ్యతిరేకత వస్తుండటం.. పైగా సింగరేణి అధికారులు ఇచ్చిన నివేదికతో కేసీఆర్ ఒకింత కంగుతిన్నారట. ఇవన్నీ సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్ ఈ పరిస్థితుల్లో అసలు ఏపీ విషయాల్లో వేలు పెట్టడం అవసరమా..? మిన్నకుండిపోయారట. అంతేకాదు.. ఇకపై స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడే కానీ టాపిక్ రాకూడదని అధిష్టానం నుంచి గులాబీ నేతలుగా స్ట్రాంగ్ హెచ్చరికలే వచ్చాయట.

Vizag-Steel-Plant-2.jpg

మొత్తానికి చూస్తే.. కేసీఆర్ ఏ కారణాలతో వెనక్కి తగ్గారో తెలియట్లేదు కానీ ఎవరికి తోచినట్లు వాళ్లు సోషల్ మీడియాలో రాసేస్తున్నారు. ఇక కేసీఆర్ వెనక్కి తగ్గడానికి తమ బీజేపీనే కారణమని క్రెడిట్ అంతా తమదే అని కమలనాథులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది..? బీఆర్ఎస్ ఎందుకు వెనక్కి తగ్గింది..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే బీఆర్ఎస్ నుంచి క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలిసేలా లేదు. మరి బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు రియాక్షన్ వస్తుందో ఏంటో..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP : తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం వైఎస్ జగన్‌ మూడాఫ్‌ అయ్యారా.. ఈ దెబ్బతో..!

******************************

Viveka Murder Case : ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. తగ్గేదేలే అని తేల్చి చెప్పేసిన సీబీఐ.. హైకోర్టు కీలక ఆదేశాలు

******************************
AP Ministers Vs Harish Rao : తగ్గేదేలే అంటున్న హరీష్ రావు.. ఏపీ మంత్రులపై మరోసారి సీరియస్ కామెంట్స్..

******************************

Updated Date - 2023-04-21T14:04:48+05:30 IST