TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!

ABN , First Publish Date - 2023-08-25T16:47:57+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా..

TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా.. సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఝలక్ ఇచ్చేలా తొలి జాబితా.. మలి జాబితా అని లేకుండా ఒకేసారి 119 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను వందల్లో అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. ఇప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే రోజురోజుకూ పోటీచేయడానికి ఆశావాహులు, సిట్టింగులు, మాజీలు, కీలక నేతలు ఎక్కువ అవుతుండటంతో అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) సమాలోచనలు చేస్తోంది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత (Producer) ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


Appireddy-Producer.jpg

ఇంతకీ ఆయన ఎవరంటే..?

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, ఒకరిద్దరు హీరోలు కూడా కాంగ్రెస్ తరఫున పోటీచేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకూ వారు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అప్లికేషన్ మాత్రం పెట్టుకోలేదు. ఇంకొన్ని రోజులు సమయం ఉండటంతో ఒకవేళ అప్లై చేసే ఛాన్స్ ఉంది. అయితే.. తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాత అప్పిరెడ్డి (Producer Appireddy) కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీటు కోసం అప్లై కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) ప్రధాన అనుచరుడే అప్పిరెడ్డి. అయితే.. ఈయన అప్లై చేసింది ఉత్తమ్ దంపతులు అప్లై చేసుకున్న రెండు స్థానాల్లో కావడం గమనార్హం. అయితే.. ఉత్తమ్ అనుచరుడు అయ్యుండి రెండు స్థానాలకు అప్లికేషన్స్ వేయడం చర్చనీయాంశం అయ్యింది. కాగా అప్పిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, టాలీవుడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ తెలుగులో ‘జార్జిరెడ్డి’, ‘అర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు’, తాజాగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల రీ-రిలీజ్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రీ-రిలీజ్ చేసే సమయాలను మార్చుకోవాలని.. లేదంటే చిన్న నిర్మాతలు నష్టపోతారన్నారు. చిన్న సినిమాలు రిలీజయ్యే రోజు బడా సినిమాలను రీ-రిలీజ్‌ చేయడం ఆపాలని అభిప్రాయపడ్డారు.

Appireddy-P.jpg

ఈ రెండు స్థానాల్లోనే ఎందుకంటే..?

హుజూర్‌నగర్, కోదాడ నుంచి అప్పిరెడ్డి అప్లికేషన్స్ వేశారు. అయితే ఈ రెండు స్థానాల నుంచే ఎందుకనే దానిపై కూడా వివరించారు. ఉత్తమ్ దంపతులు పోటీ నుంచి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పిరెడ్డి వెల్లడించారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడే.. కోదాడ, హుజూర్‌నగర్ స్థానాల్లో ఏదో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని మీడియాకు వెల్లడించారు. అయితే.. తనకు టికెట్ వస్తే పోటీచేస్తానని లేని పక్షంలో.. ఉత్తమ్ దంపతులు పోటీచేసినా సరే ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఉత్తమ్ దంపతులకు పోటీచేసినా తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఉత్తమ్, పద్మావతిల గెలుపు కోసం అప్పిరెడ్డి అహర్నిశలు శ్రమించారని ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లా నేతల ఎన్నికల ప్రచారంలో కూడా అప్పిరెడ్డి పాల్గొన్నారు.

Appireddy-With-Revanth.jpg

ఆ రెండు నియోజకవర్గాల్లో ఇలా..?

కాగా.. కోదాడ నుంచి 2014, 2018లో ఉత్తమ్ సతీమణి నలమాడ పద్మావతి రెడ్డి (Nalamada Padmavathi Reddy) పోటీ చేశారు. 2014 లో పద్మావతి గెలవగా.. 2018లో 756 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి పోటీచేయగా.. 2009, 2014, 2018లో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయానికి హుజూర్‌నగర్ నుంచి రాజీనామా చేసి.. నల్గొండ ఎంపీగా బరిలోకి దిగి అక్కడ కూడా ఘన విజయం సాధించారు. అయితే ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పోటీచేయగా.. 43,358 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై ఓటమి చెందారు. ఒకవేళ ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని.. తనకు అవకాశం వస్తుందని బహుశా అప్పిరెడ్డి ఆశిస్తున్నారేమోనని టాక్ నడుస్తోంది.

Appireddy-With-Padmavathi.jpg

నేడే చివరి రోజు..!

కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుకు నేడే చివరి రోజు. ఇప్పటివరకూ.. కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కీ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, నాగార్జున సాగర్ నుంచి కుందూరు జానారెడ్డి, జానా ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి.. ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, కూతురు త్రిష పేరుతో మరో దరఖాస్తు వేశారు. ఇక ములుగు నుంచి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క, పినపాక నుంచి సీతక్క కుమారుడు సూర్యం, హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి, మిర్యాలగూడ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, కరీంనగర్ నుంచి రమ్యా రావుతో పాటు ఆమె కుమారుడు రితేష్ రావు, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ యాదవ్, మునుగోడు నుంచి పున్నా కైలాష్ నేత, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి, వినోద్ రెడ్డి అప్లికేషన్లు వేశారు. మరికాసేపట్లో మధిర టికెట్ కోసం భట్టి విక్రమార్క దరఖాస్తు చేసుకోనున్నారు. చివరి రోజు కావడంతో గాంధీ భవన్ ఆశావాహులతో కోలాహలంగా మారింది.

Appireddy-Yuvasena.jpg


ఇవి కూడా చదవండి


BRS Vs Congress : బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన ఎమ్మెల్సీ పల్లా.. ఎందుకీ పైత్యం..!?


KCR Cabinet : పట్నం మహేందర్ రెడ్డికి రెండు శాఖలు కేటాయించిన కేసీఆర్.. ట్విస్ట్ ఇచ్చిన కొత్త మంత్రి..!?


KCR Meets Governor : గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేక భేటీ.. 20 నిమిషాలు ఏమేం చర్చించారు..!?


TS Politics : కేసీఆర్‌కు ఊహకందని షాకివ్వబోతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్ తర్వాత ఇదే రికార్డ్..!?


Mynampally Issue : మైనంపల్లిపై ఏక్షణమైనా సస్పెన్షన్ వేటు.. బీఆర్ఎస్ తరఫున మల్కాజిగిరి బరిలో విజయశాంతి..!?


Telangana Assembly polls : మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించేద్దామనుకున్న కేసీఆర్.. అనూహ్యంగా ఎంటరైన తలసాని.. ఇద్దరు మంత్రుల పోటాపోటీ..!?


Updated Date - 2023-08-25T19:01:31+05:30 IST