Telangana Assembly polls : మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించేద్దామనుకున్న కేసీఆర్.. అనూహ్యంగా ఎంటరైన తలసాని.. ఇద్దరు మంత్రుల పోటాపోటీ..!?

ABN , First Publish Date - 2023-08-24T17:32:26+05:30 IST

మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ (Mynampalli Issue) అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి..

Telangana Assembly polls : మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించేద్దామనుకున్న కేసీఆర్.. అనూహ్యంగా ఎంటరైన తలసాని.. ఇద్దరు మంత్రుల పోటాపోటీ..!?

మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ (Mynampalli Issue) అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి కేసీఆర్ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు పోటీ పడుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇద్దరూ కీలక మంత్రులే కావడంతో నో చెప్పడానికి సీఎం కేసీఆర్ నోట మాట రావట్లేదట. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరు..? ఎందుకు ఇంతలా పోటీ పడుతున్నారు..? ఎవరి కోసం ఇంతలా తిరుగుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనం..


Mynampalli-Rohit.jpg

ఇదీ అసలు కథ..?

టికెట్ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు తలసాని శ్రీనివాస యాదవ్ (Talasani Srinivasa Yadav) కాగా.. ఇంకొకరు చామకూర మల్లారెడ్డి (CH Malla Reddy). ఈ మంత్రులిద్దరూ కేసీఆర్‌కు బాగా ఆప్తులు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచట్లేదట. తలసాని తన కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ (Talasani Sai Kiran Yadav) కోసం.. ఇక మల్లారెడ్డి మాత్రం తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) కోసం విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకూ అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి (Chintala Vijayasanthi) .. మర్రి రాజశేఖర్ మాత్రమే పోటీ పడ్డారు. దాదాపు విజయశాంతికే కేసీఆర్ ఓటేస్తారని బయట టాక్ కూడా నడిచింది. కానీ.. అనూహ్యంగా తలసాని ఇద్దరి మధ్యలో ఎంటరయ్యారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యిందట. ఇక దేవాలయ సందర్శనలో ఉన్న మైనంపల్లి.. రేపో మాపో హైదరాబాద్‌‌కు (Hyderabad) తిరుగుపయనం కానున్నారు. ఆ తర్వాత ఆయన.. మంత్రి హరీష్ రావుపై (Minister Harish Rao) చేసిన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెబితే సరే లేకుంటే వేటు వేయాలని అధిష్టానం భావిస్తోందట. అంటే.. చివరి చాన్స్‌గా క్షమాపణ అన్న మాట. అయితే.. మైనంపల్లి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. అవసరమైతే రాజీనామా చేసి వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Malkajagiri-Members.jpg

ఓ రేంజ్‌లో తలసాని ప్రయత్నాలు..!

ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న తలసాని సాయి, మర్రి రాజశేఖర్ ఇద్దరూ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన వారే. 2019 ఎన్నికల్లో మొదటిసారి పార్లమెంట్ బరిలో నిలిచిన ఈ ఇద్దరూ ఓడిపోయారు. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి ఎంపీగా పోటీచేయగా.. 62,114 ఓట్ల తేడాతో బీజేపీ తరఫున పోటీచేసిన జి. కిషన్ రెడ్డి (G Kishan Reddy) గెలుపొందారు. ఆ తర్వాత ఈయనకు కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే ఈ ఓటమిపై బీఆర్ఎస్‌లోనే చాలా మంది చిత్రవిచిత్రాలుగా మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయించాలని తలసాని భావించినప్పటికీ హైదరాబాద్ సిటీలో.. చుట్టుపక్కలా ఎక్కడా ఖాళీ లేదు. సరిగ్గా ఇదే సమయంలో మైనంపల్లి వ్యవహారంతో రచ్చ రచ్చ కావడంతో.. మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకోవాలని తలసాని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారట. ఆఖరికి అమెరికాలో ఉన్న మంత్రి కేటీఆర్ ద్వారా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ‘బాపు ఎలా చెబితే అలానే.. నేను చేయాల్సిందేముంది అన్నా..’ అని తలసానికి చెప్పారట. ఈ ఒక్కసారికి టికెట్ ఇవ్వండని గెలిపించుకొని అసెంబ్లీలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని అటు కేటీఆర్‌కు.. ఇటు కేసీఆర్‌కు ఇద్దరికీ మాటిచ్చారట.

Talasani.jpg

సారూ ఒక్క ఛాన్స్!

ఇక మర్రి విషయానికొస్తే.. ఈయన మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డిపై కేవలం 10,919 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వాస్తవానికి మైనంపల్లికి మల్లారెడ్డికి (Myanampally Vs Mallareddy) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు 2014 నుంచే ఉన్నాయి. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి పోటీచేయగా.. బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి పోటీచేశారు. 28,371 ఓట్ల తేడాతో మల్లారెడ్డే విజయం సాధించారు. ఆ తర్వాత మల్లారెడ్డి కారెక్కినప్పటికీ ఈ ఇద్దరూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువే. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా.. తన అల్లుడిని ఎంపీగా బరిలోకి దింపారు. అయితే.. అల్లుడిని కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి తీసుకెళ్లాలనేది మల్లారెడ్డి కోరికట. ఇప్పుడు మంచి అవకాశం రావడంతో ఎట్టి పరిస్థితుల్లో మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని.. కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన చేసిన మరుక్షణం నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే పలుమార్లు ప్రగతి భవన్‌కు వెళ్లి నేరుగా సీఎం కేసీఆర్‌తోనే కూర్చొని చర్చించారు. అల్లుడి అభ్యర్థిత్వంపై పరిశీలన చేయాలని.. కచ్చితంగా గెలిపించుకొని ప్రగతి భవన్‌కు తీసుకొస్తానని కేసీఆర్‌కు మాట కూడా ఇచ్చారట.

Marri-And-Mallareddy.jpg

ఫైనల్‌గా ఏం జరుగునో..?

టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరూ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినవారే. గతంలో ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చాం కదా..? ఈసారి అక్కర్లేదని విజయశాంతికే టికెట్ ఇచ్చేయాలన్నది కేసీఆర్ ఆలోచనట. అయితే కొందరు మంత్రులు.. మల్లారెడ్డికి సపోర్టు చేస్తుండగా.. మరికొందరు మంత్రులు, కవిత, కేటీఆర్ కూడా తలసానికి సపోర్టు చేస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు మల్లారెడ్డి-తలసాని బలప్రదర్శన చేసినట్లే అన్న మాట. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మనసులో ఏముంది.. ఫైనల్‌గా ఎవరికి అవకాశం ఇస్తారు..? అనేదానిపై తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

KCR-List.jpg


ఇవి కూడా చదవండి


Mynampally Issue : మైనంపల్లిపై ఏక్షణమైనా సస్పెన్షన్ వేటు.. బీఆర్ఎస్ తరఫున మల్కాజిగిరి బరిలో విజయశాంతి..!?


TS Assembly Polls : రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ గెలిస్తే పరిస్థితేంటి.. రాజీనామా ఎక్కడ్నుంచి.. లక్కీ ఛాన్స్ ఎవరికి..!?


Where Is Vamsi : వల్లభనేని వంశీ కనబడుటలేదు.. వైఎస్ జగన్‌తో దుట్టా భేటీలో అసలేం జరిగింది.. ఎందుకీ మౌనం..!?


BRS List : కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక మైనంపల్లి రియాక్షన్ ఇదీ.. ఈ ట్విస్ట్ ఏంటో..!?


Updated Date - 2023-08-24T17:41:55+05:30 IST