Where Is Vamsi : వల్లభనేని వంశీ కనబడుటలేదు.. వైఎస్ జగన్‌తో దుట్టా భేటీలో అసలేం జరిగింది.. ఎందుకీ మౌనం..!?

ABN , First Publish Date - 2023-08-22T18:30:56+05:30 IST

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!

Where Is Vamsi : వల్లభనేని వంశీ కనబడుటలేదు.. వైఎస్ జగన్‌తో దుట్టా భేటీలో అసలేం జరిగింది.. ఎందుకీ మౌనం..!?

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..! దీంతో గన్నవరం నియోజకవర్గం (Gannavaram Constituency) వేదికగా అసలేం జరుగుతోందో అభిమానులు, అనుచరులు, కార్యకర్తలకు అర్థం కాక ఆందోళన చెందుతున్న పరిస్థితి. తన గురించి పొల్తెత్తి మాటన్నా సరే మీడియా గొట్టాల ముందు వాలిపోయే వంశీ.. అడ్రస్ కనిపించట్లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా (Social Media) Where Is Vamsi అని సొంత పార్టీ అభిమానులే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక ప్రతిపక్ష పార్టీలు అయితే.. Where Is Vallabha అని సెటైరికల్‌గా పంచ్‌లు వేస్తు్న్నారు. ఇంతకీ వంశీ ఏమయ్యారు..? సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) దుట్టా రామచంద్రరావు (Dutta Ramachandra Rao) భేటీలో ఏం జరిగింది..? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది..? రానున్న ఎన్నికల్లో వంశీ గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్నారా..? లేకుంటే వేరొకరు పోటీచేస్తున్నారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనం..


Vamsi-Sad.jpg

అసలేం జరిగింది..?

టీడీపీ (Telugudesam) తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ వైసీపీ (YSR Congress) పంచన చేరిపోయారు. ఈయన రాకను మొదట్నుంచీ గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao), దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చివరాకరికి వైసీపీ కార్యకర్తలను వంశీ వర్గీయులు.. కేసులు, గొడవలు పడినప్పటికీ పార్టీలోనే కొనసాగారు. ఇదీ సార్ పరిస్థితి అని చెప్పుకోవడానికి అపాయిట్మెంట్ అడిగినా సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఇవ్వని పరిస్థితి. దీంతో విసిగివేసారిపోయిన యార్లగడ్డ.. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దుట్టా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని మొదట వార్తలు వచ్చినప్పటికీ ఎందుకో అదేమీ జరగలేదు. కాగా.. రేపో, మాపో వైసీపీ క్యాడర్ మొత్తం టీడీపీలో చేరిపోనుంది. ఇక్కడి వరకూ అంతా ఓకే.. చేరిక ముందు హైదరాబాద్ వేదికగా యార్లగడ్డ.. టీడీపీ అధినేత చంద్రబాబును (TDP Chief Chandrababu) కలిస్తే.. అటు తాడేపల్లి ప్యాలెస్‌లో దుట్టా ప్రత్యక్షమయ్యారు. తన కుటుంబంతో కలిసి వెళ్లిన దుట్టా సుమారు అరగంటకుపైగా జగన్‌తో భేటీ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే.. దుట్టాను జగనే ఆపారన్న మాట. అయితే.. దుట్టాకు ఏం చెప్పి టీడీపీలో చేరకుండా చేశారు..? అనేది బయటికి రావట్లేదు.

Yarlagadda-And-Vamsi.jpg

టికెట్ వంశీకా.. దుట్టాకా..?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జగన్‌తో భేటీ దుట్టా భేటీ (Dutta Mets YS Jagan) సమయంలో గన్నవరం టికెట్ (Gannavaram YSRCP Ticket) గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలియవచ్చింది. ఈసారి ఎలాగైనా సరే టికెట్ తనకే ఇవ్వాలని దుట్టా డిమాండ్ చేయడం.. జగన్ కూడా వేరే దారిలేక.. ఆయన్ను పోగొట్టుకోలేక ఓకే చెప్పినట్లు సమాచారం. దివంగత వైఎస్సార్‌కు (YSR) దుట్టా నమ్మినబంటు కావడం.. ఆయన మరణాంతరం వైఎస్ జగన్ వెంటే నడవడం, వైసీపీ పార్టీ ప్రారంభం నుంచి పార్టీలోనే ఉండటంతో ఈ ఒక్కసారికి గన్నవరం టికెట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలియవచ్చింది. అప్పటి వరకూ జగన్‌పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన దుట్టా.. భేటీ తర్వాత మనసు మార్చుకొని.. ఎల్లప్పుడు వైసీపీలో ఉంటానని.. జగన్ వెంటే నడుస్తానని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. గన్నవరం కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దని.. త్వరలో మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఎవరున్నా లేకున్నా తమది (కార్యకర్తలను ఉద్దేశించి) వైసీపీనేనని స్పష్టం చేశారు. మంచి రోజులు అంటే టికెట్ ఇవ్వబోతున్నారనే అర్థమని దుట్టా వర్గీయులు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే జగన్‌తో భేటీలో చర్చించిన విషయాలు, దుట్టా చేసిన కామెంట్స్.. వల్లభనేని వంశీకి తెలియడంతో ఆయన నోట మాట రావట్లేదట. అంటే వంశీకి చెక్ పెట్టి దుట్టాను బరిలోకి దింపబోతున్నాడన్న మాట. అటు టీడీపీలోకి వెళ్లలేక.. ఇటు వైసీపీలో ఇమడలేక.. అదేదో సామెత ఉంది అలా తయారయ్యిందట పరిస్థితి. అందుకే గన్నవరంలో ఇంత జరుగుతున్నా.. కనీసం మీడియా ముందుకు కూడా రావడానికి వంశీ సాహసించట్లేదని టాక్ నడుస్తోంది. అంటే.. తాడేపల్లి ప్యాలెస్‌లో (Tadepalli Palace) దుట్టా భేటీతో వంశీ నోటికి తాళం పడినట్లయ్యిందన్న మాట. అందుకే వంశీ మౌనవ్రతం (Vamsi Mouna Vratham) పాటిస్తున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఒకవేళ దుట్టాకే టికెట్ దక్కితే.. వంశీ పరిస్థితేంటో మరి ఆయన తెలియాలి..!

Dutta-Ramachandrarao.jpg

ఆ దెబ్బతోనే వంశీకి తలంటారా..?

వాస్తవానికి ఇటీవల జరిగిన పంచాయతీ ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది. అందులో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి అడ్డాగా.. అందులోనూ రెడ్డి సామాజిక వర్గం ఉన్న ‘నున్న’ గ్రామపంచాయితీలోని 9వ వార్డు ఉప ఎన్నికల్లో (Nunna Ward By Elections) వైసీపీ మద్దతుదారుడు, మాజీ ఎంపీటీసీ బొమ్మిన శ్రీనివాసరావు ఓటమిపాలయ్యారు. 25 ఓట్ల తేడాతో టీడీపీ బలపరిచిన వల్లూరు వెంకటశివ గెలుపొందారు. వైసీపీ అడ్డగా ఉన్న ఈ ప్రాంతంలో అధికార పార్టీ పరాజయం పాలవ్వడంతో టీడీపీ శ్రేణులు, యార్లగడ్డ వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వంశీకి చెక్ పెట్టాలని ఇక్కడ ఓడించి.. ఎమ్మెల్యే పరువు తీసి.. తానేంటో, తన సత్తా ఏంటో చూపించాలన్నది వెంకట్రావ్ ప్లానట. అందుకే కీలక నేతలు తిష్టవేసినా.. లక్షలు ఖర్చుపెట్టినా.. యార్లగడ్డ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓడించారట. ఈ పరిణామంతో వంశీపై జగన్ గుర్రుగా ఉన్నారని తెలిసింది. ఒకానొక సందర్భంలో వార్డు మెంబర్‌ను గెలిపించని వ్యక్తి.. ఇప్పుడున్న వ్యతిరేక పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారు..? అని కొందరు వైసీపీ ముఖ్య నేతలతో చెప్పి జగన్ అసంతృప్తిని వెళ్లగక్కారట. మరోవైపు.. వంశీకే స్వయంగా సీఎంవో నుంచి ఫోన్ వెళ్లిందని.. గట్టిగానే తలంటారని కూడా టాక్ నడుస్తోంది. అందుకే ఈ ఎన్నిక తర్వాత.. యార్లగడ్డ పార్టీ మారినా.. గన్నవరం వేదికగా ఇంత జరుగుతున్నా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటానికి వంశీ సాహసించట్లేదట. అయితే వంశీ వర్గీయులు మాత్రం అబ్బే అదేమీ లేదని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా రియాక్ట్ అవుతారని చెప్పుకుంటున్నారు. గన్నవరంలో టీడీపీ బహిరంగ సభ తర్వాత అయినా వంశీ స్పందిస్తారో లేకుంటే.. మిన్నకుండిపోతారో వేచి చూడాలి మరి.

Vamsi-and-Jagan.jpg


ఇవి కూడా చదవండి


YSRCP Vs TDP : చక్రం తిప్పిన యార్లగడ్డ.. వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ.. కలలో కూడా ఊహించి ఉండరేమో..!?


Gannavaram : టీడీపీలోకి యార్లగడ్డ.. ‘దుట్టా’ సంగతేంటి.. వైసీపీలోనే ఉంటారా.. సైకిలెక్కుతారా.. !?


BRS First List : మైనంపల్లిపై బీఆర్ఎస్ వేటు..? టికెట్ ప్రకటించాక ఇదేంటో..!?


TS Politics : గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె..!?


BRS MLAs List : రెండుసార్లు గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు ‘నో’.. కేటీఆర్ ఫ్రెండ్‌కు జై కొట్టిన కేసీఆర్!?


TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!




Updated Date - 2023-08-22T18:41:54+05:30 IST