BRS MLAs List : రెండుసార్లు గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు ‘నో’.. కేటీఆర్ ఫ్రెండ్‌కు జై కొట్టిన కేసీఆర్!?

ABN , First Publish Date - 2023-08-20T19:31:11+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్.. మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అభ్యర్థుల తొలి జాబితాను (BRS First List) రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైంది. తమకు ఈసారైనా టికెట్ దక్కకపోతుందా..? అని ఆశావహులు, పక్కాగా టికెట్ మనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. జాబితాలో తప్పుకుండా పేరుంటుందని మరికొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో..

BRS MLAs List : రెండుసార్లు గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు ‘నో’.. కేటీఆర్ ఫ్రెండ్‌కు జై కొట్టిన కేసీఆర్!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్.. మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అభ్యర్థుల తొలి జాబితాను (BRS First List) రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైంది. తమకు ఈసారైనా టికెట్ దక్కకపోతుందా..? అని ఆశావహులు, పక్కాగా టికెట్ మనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. జాబితాలో తప్పుకుండా పేరుంటుందని మరికొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి టికెట్లు ఇవ్వట్లేదని ప్రగతి భవన్‌కు పిలిపించి మరీ గులాబీ బాస్ తేల్చిచెప్పేశారు. మరికొందరు అసంతృప్తులను కూడా బుజ్జగించి పంపారు. సుమారు 20 నుంచి 30 మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వట్లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. ఆ 30 మంది ఎవరు.. ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పక్క చూపు చూడటానికి సిద్ధమవ్వగా.. ఆఖరి నిమిషం వరకూ వేచి చూసి టికెట్ దక్కని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని మరికొందరు యోచిస్తున్నారు.


Atram-Sakku-and-kova.jpg

ఇదీ అసలు సంగతి..!

ఇక అసలు విషయానికొస్తే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad) బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ల్లో టికెట్ల హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే ముథోల్, బోథ్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు ఇవ్వొద్దని సీనియర్ల లాబీయింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్టింగులకు టికెట్లు ఇస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటామని సంకేతాలు కూడా అధిష్టానానికి వెళ్లాయి. ముఖ్యంగా ఖానాపూర్, ఆసిఫాబాద్ లో సిట్టింగ్‌లను మార్చాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును (Atram Sakku) ప్రగతి భవన్‌కు పిలిపించి టికెట్ ఇవ్వలేనని.. కోవా లక్ష్మికి (Kova Lakshmi) ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) టికెట్ ఇస్తానని హమీ ఇచ్చి బుజ్జగించి పంపారు. ప్రగతి భవన్ నుంచి బయటికొచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఈ వ్యవహారం సద్దుమణగకముందే ఇదే జిల్లాలోని ఖానాపూర్ (Khanapur) నుంచి 2014, 2018 రెండుసార్లు గెలిచిన రేఖా నాయక్‌కు (Ajmera Rekha Naik) కేసీఆర్ నో చెప్పేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Ajmeera-Rekha.jpg

వాట్ నెక్స్ట్!

మంత్రి కేటీఆర్ స్నేహితుడు, ఎన్నారై జాన్సన్ నాయక్‌కు (Johnson Nayak) ఖానాపూర్ టికెట్‌ను కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలిసింది. కేసీఆర్ నిర్ణయంతో రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలియవచ్చింది. అయితే.. చివరి నిమిషం దాకా వేచి చూసి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని రేఖా నాయక్.. తన అనుచరులు, అభిమానులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎమ్మెల్యేగా పోటి చేయడంపై రేఖా నాయక్.. జాన్సన్ ఇద్దరూ చాలా రోజులుగా పోటాపోటిగా ఉన్నారు. తానంటే తానే పోటీలో ఉంటానంటూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు, సెటైర్లు విసురుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో తానే పోటీచేస్తున్నట్లు జాన్సన్ పలుమార్లు చెప్పగా.. అబ్బే అదేమీ లేదు అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని రేఖా నాయక్ ధీమాతోనే చెప్పారు. చివరాకరికి సీన్ రివర్స్ అయ్యింది. ‘అయ్యో పాపం రేఖ మేడమ్..’ టికెట్ ఇవ్వట్లేదే అని అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. అయితే.. రేఖా నాయక్ నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్నారని.. తన వ్యవహారశైలితో సొంత పార్టీ నేతలనూ దూరం చేసుకున్నారని.. ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఫలితం లేదని అధిష్టానం ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయాలు లేకపోలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత రేఖా నాయక్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో.. ఆమె అడుగులు ఎటువైపు పడతాయో వేచి చూడాల్సిందే మరి.

Janson-Nayak.jpg


ఇవి కూడా చదవండి


Gannavaram : టీడీపీలోకి యార్లగడ్డ.. ‘దుట్టా’ సంగతేంటి.. వైసీపీలోనే ఉంటారా.. సైకిలెక్కుతారా.. !?


YSRCP Vs TDP : చక్రం తిప్పిన యార్లగడ్డ.. వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ.. కలలో కూడా ఊహించి ఉండరేమో..!?


Gannavaram : చంద్రబాబుతో యార్లగడ్డ అపాయిట్మెంట్ ఖరారు.. టీడీపీలో చేరిక ఎప్పుడంటే..?


TS Assembly Polls : కాంగ్రెస్‌లో ఉంటారో.. కారెక్కుతారో క్లియర్‌కట్‌గా చెప్పేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి


BRS Candidates List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు డేట్, టైమ్, వేదిక ఫిక్స్.. సిట్టింగుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!



Updated Date - 2023-08-20T19:35:52+05:30 IST