Gannavaram : టీడీపీలోకి యార్లగడ్డ.. ‘దుట్టా’ సంగతేంటి.. వైసీపీలోనే ఉంటారా.. సైకిలెక్కుతారా.. !?

ABN , First Publish Date - 2023-08-20T17:08:56+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయ్. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎటువైపు అడుగులేస్తారో అధిష్టానానికి ఊహకందని పరిస్థితి...

Gannavaram : టీడీపీలోకి యార్లగడ్డ.. ‘దుట్టా’ సంగతేంటి.. వైసీపీలోనే ఉంటారా.. సైకిలెక్కుతారా.. !?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయ్. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎటువైపు అడుగులేస్తారో అధిష్టానానికి ఊహకందని పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే దాదాపు సద్దుమణిగింది. ఆ తర్వాత ఇదే జిల్లాలో మంత్రి పినిపే విశ్వరూప్ వర్సెస్ అమలాపురం ఎంపీ అనురాధగా (Minister Pinipe Viswaroop Vs MP Chintha Anuradha) పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఒకట్రెండుసార్లు చర్చించినా ఫలితం లేకపోయింది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan) అమలాపురంలో తిష్టవేసిన తర్వాత పరిస్థితులు అనుకూలించినట్లేనని తెలిసింది. ఈ రెండు వివాదాలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పడకముందే ఉమ్మడి కృష్ణా జిల్లాలో (Krishna District) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గన్నవరం నియోజకవర్గం (Gannavaram) వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వైసీపీ పంచన చేరడంతో .. అధికార పార్టీ తరఫున పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి వైసీపీకి గుడ్ బై చెప్పేవరకు వెళ్లాయి. ఆదివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu) యార్లగడ్డ.. హైదరాబాద్‌లో (Hyderabad) భేటీ కూడా అయ్యారు. ఇక్కడి వరకూ అంతా ఓకే.. ఇక వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు (Dutta Ramachandrarao) సంగతేటన్నది ప్రశ్నార్థకంగా మారింది.


Yarlagadda-And-Dutta.jpg

ఏం జరగబోతోంది..?

అధికార పార్టీతో పొసగక యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈనెల 22న యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారు. యార్లగడ్డ 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. అంతకుముందు వరకూ గన్నవరం నియోజకవర్గానికి అన్నీ తానై చూసుకున్న దుట్టా రామచంద్రరావు ఇద్దరూ కలిసిపోయారు. ఎన్నికల్లో యార్లగడ్డ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. అయితే.. కేవలం 838 ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవ్వడంతో తన మిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) సహకారంతో వైసీపీ పంచన చేరిపోయారు. వంశీ రాకను యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ వ్యతిరేకించినప్పటికీ అప్పట్లో నచ్చజెప్పి వెల్‌కమ్ చెప్పింది వైసీపీ. దీంతో వంశీ ఒక్కరే ఒకవైపు ఉండగా.. మరోవైపు దుట్టా, యార్లగడ్డ ఒక్కటయ్యారు. వంశీ రాకతో మొదలైన వివాదం యార్లగడ్డ రాజీనామా చేసేవరకూ వెళ్లింది. అభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే.. యార్లగడ్డకు సపోర్టుగా నిలిచిన.. సీనియర్ నేత దుట్టా పరిస్థితేంటో అర్థం కావట్లేదు.

Dutta-Ramachandra-Rao.jpg

పట్టించుకోలేదే..?

ఇంత జరుగుతున్నా దుట్టా మాత్రం మౌనం పాటిస్తున్నారు. అటు యార్లగడ్డతో పాటు పసుపు కండువా కప్పుకుంటారా..? లేకుంటే వైసీపీలోనే కొనసాగుతారా..? అని తెలియక నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YS Rajasekhar Reddy) నమ్మినబంటుగా ఉన్న దుట్టా.. ఆయన మరణాంతరం వైఎస్ జగన్ వెంట నడిచినవారులో ఈయన కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున వంశీ పోటీచేయగా.. వైసీపీ తరఫున రామచంద్రరావు పోటీచేశారు. అయితే.. 9,548 ఓట్ల తేడాతో వంశీ గెలిచారు. అయినప్పటికీ వైసీపీలోనే ఉంటూ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆఖరికి 2019 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కనప్పటికీ యార్లగడ్డకు అన్ని విధాలుగా మద్దుతుగా నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమిపాలయ్యింది. అయినప్పటికీ పార్టీని వీడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ దుట్టా గురించి ఏ రోజూ వైఎస్ జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంతవరకూ ఆ ఊసేలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. యార్లగడ్డ టీడీపీలో చేరకుండా ఉండేందుకు.. వంశీకి ఈసారి వైసీపీ టికెట్ ఇచ్చి.. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. యార్లగడ్డకు హామీ ఇచ్చారు కానీ.. మొదట్నుంచీ పార్టీకోసం పనిచేసిన దుట్టాకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి పదవి ఇవ్వకపోవడం.. కనీసం ఆయనకు అపాయిట్మెంట్ ఇచ్చి మాట్లాడకపోవడం గమనార్హం.

Yarlagadda-And-Jagan.jpg

టీడీపీలోకేనా..?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఇన్నిరోజులుగా ఒక్కటిగా ఉన్న యార్లగడ్డ, దుట్టా కలిసే టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే.. దుట్టా ముఖ్య అనుచరులు మాత్రం వైసీపీలోనే ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉంటే.. చంద్రబాబు భేటీలో దుట్టా ప్రస్తావన కూడా వచ్చినట్లు ప్రచారం మాత్రం జరుగుతోంది. మరోవైపు.. ఈనెల 22న యార్లగడ్డతో పాటు దుట్టా కూడా పసుపు కండువా కప్పుకుంటారని యార్లగడ్డ వర్గీయులు కొందరు చెబుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో అనూహ్యంగా కండువా కప్పుకుంటారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే.. దుట్టా మాత్రం సమయం వచ్చినప్పుడు తన నిర్ణయం చెబుతానని మీడియాకు వెల్లడించారు. మొత్తానికి చూస్తే.. అటు వైసీపీకి దూరమై.. ఇటు టీడీపీలో చేరికపై క్లారిటీ లేక దుట్టా తర్జనభర్జన పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి 22న ఏం జరుగుతుందో చూడాలి మరి.

Dutta-And-Jagan.jpg


ఇవి కూడా చదవండి


Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?


YSRCP Vs TDP : చక్రం తిప్పిన యార్లగడ్డ.. వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ.. కలలో కూడా ఊహించి ఉండరేమో..!?


Gannavaram : చంద్రబాబుతో యార్లగడ్డ అపాయిట్మెంట్ ఖరారు.. టీడీపీలో చేరిక ఎప్పుడంటే..?


TS Assembly Polls : కాంగ్రెస్‌లో ఉంటారో.. కారెక్కుతారో క్లియర్‌కట్‌గా చెప్పేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి


BRS Candidates List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు డేట్, టైమ్, వేదిక ఫిక్స్.. సిట్టింగుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!


MLA Candidates : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. పొంగులేటి పరిస్థితేంటి..!?


Updated Date - 2023-08-20T17:13:02+05:30 IST