Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?

ABN , First Publish Date - 2023-08-11T16:27:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే...

Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం జగన్‌కు పెద్దతలనొప్పిగానే మారినట్లయ్యింది. ఇది సద్దుమణగక ముందే ఇదే ఉమ్మడి జిల్లాలో మంత్రి పినిపే విశ్వరూప్ వర్సెస్ అమలాపురం ఎంపీ అనురాధగా (Minister Pinipe Viswaroop Vs MP Chintha Anuradha) పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఒకట్రెండుసార్లు చర్చించినా ఫలితం లేకపోయింది. అయితే శుక్రవారం నాడు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి వర్సెస్ ఎంపీ పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.


Pinipe-Vs-MP.jpg

ఒంటి గంటకే రావాల్సినప్పటికీ..!

కోనసీమ జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్ (CM YS Jagan Reddy) మధ్యాహ్నం ఒంటి గంటకే తిరుగుపయనమై తాడేపల్లికి చేరుకోవాల్సి ఉంది. కానీ అమలాపురంలోనే సీఎం మకాం వేశారు. ఎప్పట్నుంచో ఎంపీ అనురాధ- మంత్రి విశ్వరూప్ మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలపై జగన్ చర్చించారు. అయితే చర్చలు కొలిక్కి రాలేదని తెలియవచ్చింది. అయితే.. ఎప్పుడు జిల్లాల పర్యటనకు వచ్చినా సభ ముగిసిన వెంటనే తిరిగి తాడేపల్లికి పయనమయ్యే జగన్.. ఈసారి మాత్రం ఏకంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు అమలాపురంలోనే తిష్ట వేశారు. 03:30 గంటలు అయినా ఇంకా అమలాపురంలోనే సీఎం ఉన్నారు. కాగా.. ఇవాళ సీఎం ప్రోగ్రామ్‌లో మంత్రి, ఎంపీ ఇద్దరూ పాల్గొన్నప్పటికీ ఎడ ముఖం, పెడ ముఖంతో ఉన్నారు. వైసీపీ అసంతృప్త నేతలతో ఇంకా మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు ఏ మాత్రం సక్సెస్ అవుతాయి..? సీఎం ఎప్పుడు తిరుగు పయనం అవుతారో చూడాలి మరి.

Jagan-Tour.jpg

ఎందుకీ రచ్చ..!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానున్న ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ బరిలో తన కుమారుడు శ్రీకాంత్‌ను పోటీ చేయించాలని మంత్రి విశ్వరూప్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఇలా పక్కా ప్లాన్‌తోనే ఎంపీని ప్రతికార్యక్రమంలో సైడ్ చేసుకుంటూ వస్తున్నారని.. ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తూ వస్తున్నారని ఉమ్మడి తూ.గో జిల్లాలో నేతలు చర్చించుకుంటున్నారు. ఇటీవల.. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను బటన్ నొక్కి జగన్ డబ్బులు జమ చేయాల్సి ఉంది. అయితే.. ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆగస్టు-11న అమలాపురంలో పర్యటించారు. అయితే అప్పట్లో మంత్రి అనుచరులు, నేతలు ముద్రించిన ఫ్లెక్సీలు, బ్యానర్లలో ఎక్కడా ఎంపీ ఫొటో కనిపించలేదు. ఎంపీ ఫొటో దగ్గర శ్రీకాంత్ ఫొటోలను ముద్రించడంతో పెద్ద వివాదమే నడిచింది. వాస్తవానికి మంత్రి-ఎంపీ మధ్య చాలా రోజులుగా ఎడ మొహం, పెడ మొహంగా ఉంటూ వస్తున్నారు. అయితే.. ఇలా వరుసగా తనను అవమానిస్తున్నారని సీఎంకు ఎంపీ ఫిర్యాదులు చేయడంతో .. ఇవాళ పర్యటనతో తేల్చేయాలని సీఎం అక్కడా మకాం వేశారని అర్థం చేసుకోవచ్చు. ఫైనల్‌గా సీఎం ఏం తేలుస్తారు..? ఇద్దరి మధ్య వివాదానికి ఎలా ఫుల్‌స్టాప్ పెడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Jagan-T.jpg


ఇవి కూడా చదవండి


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?


TS Assembly Election 2023 : ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన కాంగ్రెస్.. ఇక అస్త్రాలు ప్రయోగించడమే ఆలస్యం.. ఈ దెబ్బతో..!


Updated Date - 2023-08-11T16:39:18+05:30 IST