TS Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఇవన్నీ అందులో ఉంటాయా.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..!?

ABN , First Publish Date - 2023-07-03T17:23:12+05:30 IST

అవును.. తెలంగాణలో ఎన్నికల (TS Elections) సీజన్ వచ్చేసింది.. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్షపార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు పోటాపోటీగా ఎన్నికల హామీలు, బహిరంగ సభలు నిర్వహించేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ కంటే ఒక అడుగు ముందే ఉంది కాంగ్రెస్..

TS Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఇవన్నీ అందులో ఉంటాయా.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..!?

అవును.. తెలంగాణలో ఎన్నికల (TS Elections) సీజన్ వచ్చేసింది.. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్షపార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు పోటాపోటీగా ఎన్నికల హామీలు, బహిరంగ సభలు నిర్వహించేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ కంటే ఒక అడుగు ముందే ఉంది కాంగ్రెస్. అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తుండటం, భారీగా చేరికలు, కీలక ప్రకటనలతో దూసుకెళ్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే అందరికంటే ముందుగానే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేసి ప్రజాక్షేత్రంలోకి పంపించాలని అధిష్టానం రంగం సిద్ధం చేసేసింది. ఇందుకు ముహూర్తం కూడా అగ్రనేతలు ఫిక్స్ చేసేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ప్రకటించిన హామీలేంటి..? మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు..? ఏమేం ప్రకటించే అవకాశాలున్నాయి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

T-Congress.jpg

ముహూర్తం ఎప్పుడంటే..!

తొమ్మిదేళ్లుగా అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. దక్షిణాదిలో కూడా పార్టీ ఇక తుడిచిపెట్టుకొని పోతుందనుకున్న టైమ్‌లో కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Election Results) అఖండ విజయం పార్టీకి ఊపిరిలూదింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం వచ్చింది. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినిలవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సువార్ణవకాశంగా మలుచుకుని కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ అగ్రనేత, యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో రైతు డిక్లరేషన్ (Rythu Declaration), ఆ తర్వాత సరూర్‌నగర్‌ సభావేదికగా ప్రియాంకగాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ (Youth Declaration) , ఖమ్మం జనగర్జన వేదికగా.. వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు పెన్షన్ ప్రకటించడం.. ఇలా ఏదిచేసినా చాలా వ్యూహాత్మకంగా అధిష్టానం ముందుకెళ్తోంది. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు సుమారు 9 నుంచి 10వరకు డిక్లరేషన్లు ప్రకటించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అతి త్వరలోనే పూర్తి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) సెప్టెంబర్-17న తెలంగాణకు విచ్చేయనున్నారని అధికార ప్రకటన వచ్చింది. ఈ సందర్భంగా సోనియా చేతుల మీదుగా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మేనిఫెస్టో ప్రకటించిన మరుసటి రోజు నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని అధిష్టానం నుంచి నేతలకు ఆదేశాలు వెళ్లనున్నాయని తెలుస్తోంది.

Rahul-Sonia-and-Priya.jpg

మేనిఫెస్టోలో ఏమేం ఉండొచ్చు..?

కేసీఆర్‌ను (KCR) ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా ఉండాలంటే గత తొమ్మిదేళ హయాంలో సర్కార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను మించి కాంగ్రెస్ ప్రకటన చేయాల్సిందే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదేమో. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించగా.. తాజాగా చేయూత ఫించన్ పేరుతో వృద్ధులు, వితంతవులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ రోగులకు నెలకు రూ. 4వేలు చొప్పున ఇస్తాన జనగర్జన సభావేదికగా రాహుల్ ఎన్నికల హామీ ప్రకటించారు. అయితే.. ప్రతి 25 రోజులకోసారి ఇలా ఒక్కో డిక్లరేషన్ ప్రకటించాలని పార్టీ వర్గాలు భావించినప్పటికీ అందరికంటే మేనిఫెస్టో ముందే ప్రకటించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, సంక్షేమ, పాలన డిక్లరేషన్లతో పాటు పలు కీలక ప్రకటనలు సోనియా గాంధీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లాగే కొన్ని మార్పులు, చేర్పులు చేసినవి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయట. ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గృహ విద్యుత్‌తో సిద్ధా సర్కార్‌కు ఎక్కడలేని తిప్పలొచ్చిపడుతున్నాయి. అందుకే తెలంగాణలో మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోందట. దీంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణిని రద్దు చేస్తామని హామీలిచ్చే అవకాశముంది. దీంతో పాటు.. 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పంటకు మద్దతు ధరతో పాటు బోనస్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, రైతుబందు సహాయం పెంపు, చదువుకునే అమ్మాయిలకి ఎలక్ట్రికల్ బైక్స్, నిరుద్యోగ భృతితో పాటు కీలక హామీలు సోనియా గాంధీ ఇవ్వబోతున్నారట.

Sonia-Gandhi-Manifesto.jpg

అభ్యర్థుల ప్రకటన ఇలా..!?

ఇదిలా ఉంటే.. జులై- 15న 80 మందితో ఎమ్మెల్యే అభ్యర్థులతో(BRS Mla Candidates) కూడిన తొలి జాబితాను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. అయితే ఆ తర్వాత 15 రోజుల వ్యవధిలో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో బీఆర్ఎస్‌లో ఎవరికి టికెట్ దక్కలేదు..? అసంతృప్తితో రగిలిపోతున్నదెవరు..? కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతల పరిస్థితేంటి..? ఇలా అన్నీ బేరీజు చేసుకుని చేరికలు షురూ చేయాలని అధిష్టానం ప్లాన్‌తో ఉందట. అప్పుడైతేనే భారీగానే చేరికలు ఉంటాయని.. ఇది పార్టీకి బాగా కలిసొస్తుందని అగ్రనేతలు భావిస్తున్నారట. ఇప్పటికే అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు అసంతృప్తిని వెళ్లగక్కుతారో తెలియని పరిస్థితి. ఇలా అన్నీ లెక్కలేసుకున్నాక అక్టోబర్-02న మొత్తం అభ్యర్థులను (Congress Mla Candidates) ఒకేసారి ప్రకటించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది.

Rahul-Sonia-and-Priya-1.jpg

మొత్తానికి చూస్తే.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. అంతేకాదు రాసిపెట్టుకోండి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన, సోనియా గాంధీ పుట్టిన రోజున డిసెంబర్-09న అధికారంలోకి వచ్చేస్తున్నామని ధీమాతో నేతలు ప్రకటనలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విశ్వప్రయత్నాలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయి..? సెప్టెంబర్-17న సోనియా ప్రకటించే మేనిఫెస్టోలో ఏమేం ఉంటాయి..? అనే విషయాలపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Sonia-and-Revanth.jpg


ఇవి కూడా చదవండి


TS BJP : హమ్మయ్యా.. ఈటలకు కీలక పదవి వచ్చేసిందిగా.. ఒక్క ట్వీట్‌తో కన్ఫామ్ చేసేసిన రాజేందర్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!


TS BJP : తెలంగాణ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి వద్దన్నారా.. అగ్రనేతల ఆలోచనేంటి.. ‘బండి’ ముందు రెండు ఆప్షన్లు.. రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..!?


AP Politcs : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అంబటి రాయుడు ఫొటో.. అసలు విషయమేంటో తెలిస్తే..!


Minister KTR : ఏంటిది సారూ.. టచ్ చేయకూడదా..? దండం పెట్టినా ఎందుకిలా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!


Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!


OHRK : రాహుల్ సభలో ప్రత్యేక ఆకర్షణగా పొంగులేటి.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ


Updated Date - 2023-07-03T17:31:02+05:30 IST