TS BJP : తెలంగాణ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి వద్దన్నారా.. అగ్రనేతల ఆలోచనేంటి.. ‘బండి’ ముందు రెండు ఆప్షన్లు.. రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..!?

ABN , First Publish Date - 2023-07-01T21:07:18+05:30 IST

తెలంగాణ బీజేపీలో (TS BJP) పెనుమార్పులు చోటుచేసుకునున్నాయా..? గులాబీ పార్టీని (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని వ్యూహాత్మకంగా కమలం పార్టీ అడుగులు వేస్తోందా..? రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారా..?..

TS BJP : తెలంగాణ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి వద్దన్నారా.. అగ్రనేతల ఆలోచనేంటి.. ‘బండి’ ముందు రెండు ఆప్షన్లు.. రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..!?

తెలంగాణ బీజేపీలో (TS BJP) పెనుమార్పులు చోటుచేసుకునున్నాయా..? గులాబీ పార్టీని (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని వ్యూహాత్మకంగా కమలం పార్టీ అడుగులు వేస్తోందా..? రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారా..? రాష్ట్ర బీజేపీ నేతలకు కీలక పదవులు కట్టబెట్టి అసంతృప్తి అనేది లేకుండా చేయడానికి కమలనాథులు భారీగానే స్కెచ్ వేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి వస్తున్న వార్తల్లో నిజమెంత..? ఒకవేళ ఇదే నిజమైతే బండి సంజయ్ పరిస్థితేంటి..? అసలు అధ్యక్ష పదవి బరిలో ఎవరెవరున్నారు..? కీలక పదవులు వరిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఈటల రాజేందర్ (Etela Rajender), డీకే అరుణ (DK Aruna) పరిస్థితేంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..

Bandi.jpg

ఈ గందరగోళ పరిస్థితుల్లో..!

తెలంగాణ బీజేపీలో గత కొన్నిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు నేతల మధ్య వర్గ విబేధాలు, ఇంకోవైపు అసంతృప్తి, అంతకుమించి సొంతపార్టీ నేతలపైనే విమర్శలు, కౌంటర్లతో రచ్చ రచ్చ అవుతోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో తెలంగాణ అధ్యక్షుడిని మారుస్తున్నారన్న బాంబ్ లాంటి వార్త బయటికొచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తారని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘టార్గెట్ తెలంగాణ’గా (Target) ముందుకెళ్తున్న ఢిల్లీ పెద్దలు.. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇందుకు తగ్గ వ్యూహాల అమలులో భాగంగా అధ్యక్షుడిని మార్చాలని భావిస్తున్నారట. రెండుమూడ్రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah) , జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత బీఎల్ సంతోష్‌తో కూడిన అగ్రనాయకత్వం కీలక కసరత్తలు చేస్తోంది. మూడేళ్ల పదవి కాలం ముగిసిన రాష్ట్ర అధ్యక్షులు, కీలక పదవుల్లో ఉన్నవారిని మార్చాలని చర్చించారట. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కీలకంగా ఉన్న వ్యక్తులెవరు అని చర్చకు రాగా.. కిషన్ రెడ్డి అయితే పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా అధికారంలోకి తీసుకురావడానికి అన్నివిధాలుగా అర్హుడని అగ్రనేతలు ఓ నిర్ణయానికొచ్చారట. అయితే ప్రస్తుతం కిషన్‌కు ఉన్న కేంద్ర మంత్రి పదవికి కూడా కంటిన్యూ అయితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయానికి కూడా వచ్చారట.

TS-BJP.jpg

బండి పరిస్థితేంటి..?

బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టిన తర్వాత మునపటితో పోలిస్తే పార్టీ పరిస్థితులు చాలా మారాయి. పార్టీ బలోపేతం కావడమే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) 48 స్థానాల్లో గెలిపించడం, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరేయటం, టీచర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో పాటు చాలానే బండి నేతృత్వంలోనే జరిగాయి. దీంతో పాటు చేరికలు కూడా భారీగానే జరిగాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడో ఉన్న బీజేపీని.. బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకురావడంలో దీనికి కారణం బండేనని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ కోసం ఇంత చేసిన బండికి సముచిత స్థానం కల్పించాలన్నది బీజేపీ ఆలోచనట. అందుకే ఈయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలనే నిర్ణయానికి అగ్రనేతలు వచ్చారట. అంతేకాదు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందట. మరోవైపు.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ బండిని మార్చే అవకాశమే లేదని ఇటీవలే కొందరు కీలక నేతలు చెబుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ ఇలా ‘మార్పు తథ్యం’ అనే వార్తలు వస్తుండటంతో కార్యకర్తలు, వీరాభిమానులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇలా అధ్యక్ష మార్పు అనే వార్త రావడం ఇప్పుడేం కొత్త కాదు.. కర్ణాటక ఎన్నికల ముందు నుంచే వస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా రెండు మూడ్రోజుల్లో అధికార ప్రకటనే ఉంటుందని వార్తలతో బండి సంజయ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. పార్టీలో అసలేం జరుగుతోంది..? ఏమిటీ లీకులు..? ఈ కొత్త పరిణామాలు ఎలా తీసుకోవాలి..? ఒకవేళ ఇదే నిజమైతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? అనేదానిపై తన అత్యంత సన్నిహితులతో సంజయ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. బండిని మారిస్తే బీజేపీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని.. చేరికలు అస్సలే ఉండని సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుండటం గమనార్హం.

Kishan-Reddy.jpg

ఢిల్లీలో ఏం జరిగింది.. కిషన్ రెడ్డి ఏమంటున్నారు..!?

తెలంగాణ బీజేపీ నేతలు ఈ మధ్య వరుసగా హస్తినకు క్యూ కడుతున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఇద్దరి తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్లినప్పుడు ఢిల్లీ వేదికగా ఏదో జరుగుతోందని కార్యకర్తలు భావించారు. అయితే.. అగ్రనేతలంతా ఎవరికి ఏ పదవి ఇవ్వాలి..? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి..? అని అన్నీ చర్చించాకే ఢిల్లీకి పిలిపించి నిశితంగా వివరించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల బీజేపీలో చేరిన, ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్, రఘునందన్ రావులకు కూడా ప్రమోషన్ ఇవ్వాలని అగ్రనేతలు ప్లాన్ చేశారట. ఎందుకంటే పార్టీలో చేరిన తర్వాత ఇంతకాలంగా ఎలాంటి పదవులు లేకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నుంచి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే ఈటల, కోమటిరెడ్డి, రఘునందన్, డీకే అరుణకు పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Bandi-and-Etela-and-Kishan.jpg

- ఇదిలా ఉంటే.. కిషన్ రెడ్డి కూడా కేంద్రమంత్రిగా మాత్రమే ఉంటానని.. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు సుముఖంగా లేరని తెలియవచ్చింది. కీలక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మార్పులు అక్కర్లేదని.. ఎన్నికల తర్వాతే ఆలోచించాలని తెలంగాణ నుంచి నేతలు నివేదికలు సైతం పంపినట్లుగా తెలుస్తోంది. అంటే ‘పార్టీ చీఫ్ పదవి వద్దు.. కేంద్ర మంత్రి పదవే ముద్దు’ అనే ఆలోచనలో కిషన్ రెడ్డి ఉన్నారన్న మాట.

- కిషన్ రెడ్డి తర్వాత బీసీ నేత ఈటల వైపే మోదీ, అమిత్ షా మొగ్గు చూపే ఛాన్స్ ఉందట. ఎందుకంటే.. కేసీఆర్‌పై పోరులో, బీఆర్ఎస్ కిటుకులు తెలిసిన, ప్రజల్లోనూ మంచి గుర్తింపు, ఉద్యమాకారుడిగా పేరుపొందిన వ్యక్తి రాజేందర్‌. అందుకే తదుపరి ఆప్షన్ ఈటలేనట.

అధిష్టానం బండికి ఇచ్చిన ఆప్షన్లు ఏంటి..?

ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత బండిలో మునపటి జోష్ అస్సలే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్‌పై ఎప్పుడూ ఒంటికాలిపై లేచే బండి సడన్‌గా డల్ అయిపోయారు. మునుపటిలాగా యాక్టివ్‌గా కూడా లేరు. దీంతో అధ్యక్ష పదవి మార్పు పక్కా అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో బండి ముందు అగ్రనేతలు రెండు ఆప్షన్లు ఉంచారట. అందులో ఒకటి.. కేంద్ర జాతీయ ప్రధాన కార్యదర్శి.. మరొకటి కేంద్ర మంత్రి పదవి అని తెలుస్తోంది. కేంద్ర నాయకత్వంలోకి వస్తే.. ఎంపీ దర్మపురి అర్వింద్, సోయం బాపురావు, లక్ష్మణ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అగ్రనేతలు చెప్పారట. అయితే.. ఈ రెండు ఆప్షన్లకు కూడా సంజయ్ ఎలాంటి సమాధానం చెప్పకుండానే మిన్నకుండిపోయారట. తనకు ఎలాంటి పదవులూ వద్దని.. మార్పు అనేది ఉంటే సామాన్య కార్యకర్తగానే పార్టీకి సేవ చేస్తానని ఫిక్స్ అయ్యారని కూడా టాక్ నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే బండి మార్పును సంఘ్ వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం.

Bandi-Sanjay.jpg

మొత్తానికి చూస్తే.. తెలంగాణ అధ్యక్షుడిని మార్చాలని అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు కానీ.. వ్యతిరేకత కూడా అంతే రీతిలో వస్తోంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కూడా వ్యతిరేకిస్తోన్న ఈ పరిస్థితుల్లో అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది. ఈ పరిస్థితుల్లో అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఏంటో చూడాలి మరి.

bjp.jpg


ఇవి కూడా చదవండి



AP Politcs : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అంబటి రాయుడు ఫొటో.. అసలు విషయమేంటో తెలిస్తే..!


Minister KTR : ఏంటిది సారూ.. టచ్ చేయకూడదా..? దండం పెట్టినా ఎందుకిలా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!


Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!



Updated Date - 2023-07-01T21:31:58+05:30 IST