Jagan Govt : ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ ఎంపీ మాటలు వింటే చాలు.. పాపం జాలేస్తోంది జగన్..!

ABN , First Publish Date - 2023-06-20T18:03:43+05:30 IST

అవును.. విశాఖలో (Visakhapatnam) వ్యాపారం చేయను.. చేయలేను.. వేధింపులు ఎక్కువైపోయాయి.. హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్లిపోతా.. వైజాగ్ (Vizag) నగరంలో భారీ ప్రాజెక్టు చేపట్టాను.. రాయి తీసేందుకు బ్లాస్టింగ్‌ చేయాలి..

Jagan Govt : ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ ఎంపీ మాటలు వింటే చాలు.. పాపం జాలేస్తోంది జగన్..!

అవును.. విశాఖలో (Visakhapatnam) వ్యాపారం చేయను.. చేయలేను.. వేధింపులు ఎక్కువైపోయాయి.. హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్లిపోతా.. వైజాగ్ (Vizag) నగరంలో భారీ ప్రాజెక్టు చేపట్టాను.. రాయి తీసేందుకు బ్లాస్టింగ్‌ చేయాలి.. 45 రోజుల క్రితం దరఖాస్తు చేస్తే ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు.. అదే హైదరాబాద్‌లో అయితే 24 గంటల్లోనే పర్మిషన్‌ ఇచ్చారు.. ఈ మాటలు అన్నది ఎవరో కాదండోయ్.. ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ.. అందులోనూ అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana). ఎంపీ కుటుంబం కిడ్నాప్ (MP Family Kidnap) వ్యవహారం తర్వాత ఎంవీవీ నోట వచ్చిన మాటలివీ.. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) తెగ వైరల్ అవుతున్నాయి. వైసీపీలో అసలేం జరుగుతోంది..? ఏపీలో పరిస్థితులు సర్లేవా..? ఎంపీ పరిస్థితే ఇలావుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితేంటి..? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు, మేథావులు నుంచి వస్తున్నాయ్.

MVV-F.jpg

అసలేం జరుగుతోంది..?

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. వైఎస్ జగన్ (YS Jagan Reddy) పుణ్యమా అని పేరుగాంచిన ఒక్క కంపెనీ కూడా రాలేదు.. పైగా ఉన్న కంపెనీలు మేం తట్టుకోలేం బాబోయ్ అని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్న పరిస్థితి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ కంపెనీలు లులూ (Lulu Group), అమరరాజా (Amararaja) ఈ రెండు పరిశ్రమలకు అన్ని అనుమతులివ్వగా.. జగన్ రాకతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో లులూ కంపెనీను తమిళ సర్కార్ ఆహ్వానించి అన్ని అనుమతులివ్వగా ఈ మధ్యే ప్రారంభమైంది కూడా. ఇక అమరరాజాను తెలంగాణ సర్కార్ ఆహ్వానించి ఇటీవలే మంత్రి కేటీఆర్ (Minister KTR) చేతులమీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకూ కంపెనీలు వెళ్లిపోగా.. ఇప్పుడు వ్యాపారవేత్తలు కూడా వెళ్లిపోతున్న పరిస్థితి. అందులోనూ అధికార పార్టీ ఎంపీ ఇక్కడ ఉండలేను.. హైదరాబాద్ వెళ్లిపోతా అని చెబుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో. ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌కు గురైన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. ఆ తర్వాత ఒకట్రెండ్రోజులు గ్యాప్‌లోనే సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి కలిసొచ్చారు. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా జగన్‌కు ఎంపీ వివరించారు కూడా. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఎంవీవీ.. ఓ చానెల్‌ డిబెట్ వేదికగా తన మనసులోని మాటను చెప్పేశారు. ఇందులో వేధింపులు ఎక్కువయ్యాయ్ అని ఎంపీ అనడం వెనుక ప్రభుత్వంలో ఏదో జరుగుతోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

Vizag.jpg

చూస్తున్నావా జగనన్నా..!

జగన్ అధికారంలోకి వచ్చాక నవ్యాంధ్ర రాజధాని అమరావతిని (Amaravati) పక్కనెట్టి.. మూడు రాజధానులు (Three Capitals) కడతానని ఊదరగొట్టారు. ఇంతవరకూ ఆ ఊసేలేదు.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం కానీ.. ఆ మూడు రాజధానుల్లో వైజాగ్ కూడా ఒక్కటి కావడంతో ఇప్పుడు చర్చకొచ్చింది. వైజాగ్‌లో గంజాయి, రౌడీషీటర్లు.. దందాలు, గొడవలు ఎక్కువయ్యాయని ప్రతిరోజూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు (TDP Leaders) మీడియా మీట్‌లు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. అయినప్పటికీ అధికార పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడంతో ఒక్కసారిగా వైజాగ్ ఉలిక్కిపడింది.. పైగా కిడ్నాపర్ హేమంత్ వెంబడి ఉన్న యువకులంతా గంజాయి సేవించి మరీ రెచ్చిపోవడం గమనార్హం. అసలు శాంతి భద్రతలు ఏమయ్యాయి..? ఎంపీ ఫ్యామిలీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటి..? మీడియాకు తెలిసే ఇన్ని జరుగుతున్నాయంటే.. మూడో కంటికి తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి..? పరువు పోతుందని పోలీసులను ఆశ్రయించకుండా ఉండేవాళ్లు ఇంకెంతమంది ఉంటారు..? ఇవే ఇప్పుడు వైజాగ్ వాసులతో పాటు.. ఏపీ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే జగన్.. వైజాగ్‌లో ఒక రాజధాని పెడితే ఎలా ఉంటుందో పైనున్న పెరుమాళ్లకే తెలియాలి. అయినా.. తాడేపల్లిలోని జగన్ నివాసానికి అతి సమీపంలోనే రోజుకో ఘటన జరుగుతుంటే దిక్కులేదని.. ఇక వైజాగ్‌ వాసులకు రక్షణ ఎక్కడిది..? అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ‘ఇవన్నీ చూస్తున్నావా.. జగనన్నా.. లేకుంటే చూసి కూడా కళ్లు మూసుకుని ఉన్నారా’ అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా సీఎంను ప్రశ్నిస్తున్నారంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి మరి.

MVV-Family.jpg

మొత్తానికి చూస్తే.. ఎంపీ కామెంట్స్‌పై ఇంతవరకూ వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఇక దీన్నే సువార్ణకావశంగా తీసుకుని బీఆర్ఎస్ నేతలు ఏ రేంజ్‌లో జగన్ సర్కార్ విమర్శలు గుప్పిస్తారో..ఏంటో..!. పోనీ ఎంవీవీని పొమ్మనలేక.. ఇలా ఏమైనా పొగబెడుతున్నారా అనే అనుమానాలు అభిమానులు, అనుచరుల్లో వస్తున్నాయ్. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ ఎలా ముందుకెళ్తుంది..? శాంతి భద్రతల విషయంలో ఇకనైనా తీరు మారుతుందా..? సంఘ విద్రోహ శక్తులను అణిచి వేసేందుకు ప్రయత్నాలు ఏమైనా చేస్తుందో లేదో చూడాలి మరి.

Jagan-and-MVV.jpg


ఇవి కూడా చదవండి


YSRCP Manifesto : అమ్మ జగనా.. ఒకేసారి 100 జియో టవర్ల ప్రారంభం వెనుక ఇంత పెద్ద కథుందా.. ఈ విషయం బయటపడితే..?


TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!



Rakesh Master : కంటతడి పెట్టిస్తున్న రాకేశ్ మాస్టర్ వీడియో.. శిష్యుడితో ఏం చెప్పారో విన్నాక..


Tollywood : రాకేష్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..


Telugudesam : ఉంటే ఉండండి.. లేకుంటే తప్పుకోండి.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ ఒక్క మాటతో..



Updated Date - 2023-06-20T18:11:39+05:30 IST