TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!

ABN , First Publish Date - 2023-06-19T22:09:37+05:30 IST

అవును.. ఈటల రాజేందర్ (Etela Rajender) ఎందుకో మౌనం పాటిస్తున్నారు..! ఇదివరకున్నట్లుగా చురుగ్గా ఉండట్లేదు..! అసలు ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు..! ఇవీ ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తల్లో వినిపిస్తున్న మాటలు. గులాబీ (BRS) పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా (BJP) కప్పుకున్నాక హైపర్ యాక్టివ్‌గా ఉన్న ఈటల సడన్‌గా డీలా పడిపోయారు..

TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!

అవును.. ఈటల రాజేందర్ (Etela Rajender) ఎందుకో మౌనం పాటిస్తున్నారు..! ఇదివరకున్నట్లుగా చురుగ్గా ఉండట్లేదు..! అసలు ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు..! ఇవీ ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తల్లో వినిపిస్తున్న మాటలు. గులాబీ (BRS) పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా (BJP) కప్పుకున్నాక హైపర్ యాక్టివ్‌గా ఉన్న ఈటల సడన్‌గా డీలా పడిపోయారు.. సీఎం కేసీఆర్‌ (CM KCR) అంటే చాలు ఒంటికాలిపై లేచే ఈయన ఎందుకిలా మారిపోయారు..! బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎందుకు పాల్గొనట్లేదు..? కనీసం మీడియా ముందుకు కూడా ఎందుకు రావట్లేదో ఎవరికీ అర్థం కాని పరిస్థితి..!

Etela.jpg

అసలేం జరుగుతోంది..!?

కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగరేసి ‘కారు’ దిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) కీలక పరిణామాలుంటాయని కమలనాథులు భావించారు. ఉద్యమనేత కావడం, సీనియర్ నేతగా ఉండటంతో ఈయన తర్వాత భారీగానే చేరికలు ఉంటాయని రాజేందర్‌ కోసం ప్రత్యేకంగా ప్రపంచంలో ఎక్కడాలేని ‘చేరికల కమిటీ’ని ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్‌గా నియమించడం జరిగింది. అయితే.. చేరికల సంగతి దేవుడెరుగు కానీ.. ఒకరిద్దరితో తప్పితే కాషాయ కండువా కప్పించలేకపోయారు. ఎవర్ని టచ్ చేసినా ‘పార్టీలోకి వస్తే నాకేంటి..? టికెట్ ఇస్తారా లేదా.. లేకపోతే నాకిచ్చే పదవేంటి..?’ అని అడుగుతున్నారని ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడంతో పార్టీలోకి రావడానికి సాహసించట్లేదని అప్పట్లో ఈటల తన ప్రధాన అనుచరులతో చెప్పారని లీకులు వచ్చాయి. అంతేకాదు.. ప్రపంచంలో ఎక్కడైనా చేరికల కమిటీ ఉంటుందా!. ఏదో నాకు చేరికల కమిటీ చైర్మన్ అని ఇచ్చారు. నేను అర్దం చేసుకునే నాయకుడిని కాబట్టి దానికి న్యాయం చేసే ప్రయత్నం చేశాను అని తన అత్యంత సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద రచ్చే అయ్యింది. ఆ తర్వాత అదేమీ లేదని వివరణ ఇచ్చుకున్న ఈటల.. వరుసగా ఢిల్లీ పర్యటనలు.. ఆ తర్వాత అస్సాం పర్యటనలతో యమా యాక్టివ్ అయ్యారు. సీన్ కట్ చేస్తే.. ఇవాళో, రేపో రాజేందర్‌కు ప్రమోషన్ వస్తోందని.. కీలక పదవి వరించబోతోందని వార్తలొచ్చాయి. ఇంతవరకూ అడ్రస్ లేదు. ఆయన అక్కడ ఢిల్లీలోనే ఉండగానే బండి సంజయ్ వర్గం వ్యతిరేకంగా భేటీ అయ్యింది. అటు పదవి రాక.. ఇటు సొంత పార్టీలో వర్గ విబేధాలతో ఈటల బాగా డీలా పడిపోయారని తెలుస్తోంది.

Etela-Rajender.jpg

ఇప్పుడిదే చర్చ..!

‘ఈటెల రాజేందర్ కనపడుట లేదు’ ఇప్పుడు ఈ మాటలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు చేసి రెచ్చగొడుతున్నారట. పైగా బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటుండటంతో అసలేం జరుగుతోందో కార్యకర్తలకు, అభిమానులకు అర్థం కావట్లేదట. అయితే ఈటలను అగ్రనేతలు గట్టిగానే మందలించారని అందుకే ఈ పరిస్థితులు వచ్చాయనే చర్చ కూడా నడుస్తోంది. అధ్యక్ష పదవి ఆశించిన ఈటలకు..అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకు అధ్యక్ష పదవి మార్పు ఉండదు అని స్పష్టం చేయడంతో అలిగారట. అందుకే పార్టీ కార్యక్రమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రం ఇచ్చిన నిధులు, ధరణి విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా రాజేందర్ ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఈటల డుమ్మా కొట్టడంతో తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యారు.

Bandi-Dk-and-Etela.jpg

అప్పట్నుంచే ఎందుకో..?

ఆ మధ్య బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీజేపీలోకి ఆహ్వానించే టైమ్‌లో తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారంటూ నిర్వేదపు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాలు రావడంతో పొంగులేటి, జూపల్లే కాదు ఇంతవరకూ ఏ ఒక్కరూ బీజేపీవైపు తొంగిచూడలేదు. ఇచ్చిన పదవికి న్యాయం చేయలేక.. ఇటు పార్టీలో గుర్తింపు లేక.. పదవి ఇస్తున్నట్లు వార్తలొచ్చి ఆ తర్వాత ఏమీ లేక.. ఇలా వరుస పరిణామాలతో ఈటల డీలా పడిపోయారట. మరోవైపు.. బీజేపీకి బై బై చెప్పి కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈటల యాక్టివ్ అవుతారో లేకుంటే మౌనంగానే ఉండిపోతారో.. ఇవన్నీ కాదని పార్టీ మారుతారో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే మరి.

Etela-and-Shah.jpg


ఇవి కూడా చదవండి


YSRCP Manifesto : అమ్మ జగనా.. ఒకేసారి 100 జియో టవర్ల ప్రారంభం వెనుక ఇంత పెద్ద కథుందా.. ఈ విషయం బయటపడితే..?


TS Politics : అవును అవినీతి పెరిగిపోయింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు.. సడన్‌గా ఎందుకిలా..!?


Rakesh Master : కంటతడి పెట్టిస్తున్న రాకేశ్ మాస్టర్ వీడియో.. శిష్యుడితో ఏం చెప్పారో విన్నాక..


Tollywood : రాకేష్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..


Telugudesam : ఉంటే ఉండండి.. లేకుంటే తప్పుకోండి.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ ఒక్క మాటతో..


Updated Date - 2023-06-19T22:17:06+05:30 IST