TS Politics : అవును అవినీతి పెరిగిపోయింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు.. సడన్‌గా ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2023-06-18T22:13:38+05:30 IST

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి మీడియాతో తన నివాసంలో మాట్లాడిన ఆయన.. స్టేషన్ ఘన్‌పూర్‌లో (Station Ghanpur) అవినీతి పెరిగిందని కామెంట్స్ చేశారు.

TS Politics : అవును అవినీతి పెరిగిపోయింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు.. సడన్‌గా ఎందుకిలా..!?

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి మీడియాతో తన నివాసంలో మాట్లాడిన ఆయన.. స్టేషన్ ఘన్‌పూర్‌లో (Station Ghanpur) అవినీతి పెరిగిందని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కడియం హాట్ టాపిక్ అయ్యారు. మీరిచ్చిన (ప్రజలు) ఖడ్గంతో ఆ అవినీతిని అంతమొందిస్తాను. నిఖార్సైన, నిజాయితీ, మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నా. గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ధర్మసాగర్, జాఫర్‌ఘడ్,స్టేషన్ ఘనపూర్‌లో తండాలకు రోడ్లు వేసుకున్నాం. ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, 11 కోట్లతో రోడ్లకు మంజూరు చేయించాను. రాబోయే రోజుల్లో నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని హామీ ఇస్తున్నాను. మీ (ప్రజలు) ఆశీర్వాదం నాపై ఉండాలి. స్టేషన్ ఘనపూర్‌లో బంజారా భవన్‌తో పాటు, సేవలాల్ భవన్ కూడా నిర్మిస్తాం. స్టేషన్ ఘనపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల అభివృద్ధికి కృషి చేయాలి.. కానీ డబ్బులు దండుకోకూడదు. 10 సంత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీలేదు. తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. సన్నాసుల, దద్దమ్మల మాటలు విని మోసపోవద్దుఅని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

Kadiyam-Sreehari.jpg

ఈ మాటల వెనుక..?

వాస్తవానికి కడియం శ్రీహరికి.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు (MLA Rajayya) అస్సలు పడట్లేదు. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయి. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడం, సవాళ్లు చేసుకోవడం సంచలనమైంది. అయితే ఇప్పుడు ఏకంగా.. స్టేషన్ ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిపోయిందని మీడియా ముందే వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు.. ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేసిందేమీ లేదని.. తాను మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందని పరోక్షంగా కడియం వ్యాఖ్యానించారు. తన హయాంలో ఏమేం అభివృద్ధి చేశానో కూడా చెప్పుకొచ్చారాయన. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాబోయే రోజుల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను కడియం రెక్వెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రాజయ్యను కాదని.. కడియంకే టికెట్ ఇస్తారని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రాజయ్యపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆ మధ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలోకి జంప్ అవుతారని కూడా వార్తలొచ్చాయి.

Rajayya.jpg

ఓహో ఇందుకేనా..?

ఇదిలా ఉంటే.. ఇప్పటికే సీఎం కేసీఆర్ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రహస్య సర్వేలు చేయించి మరీ ఎమ్మెల్యేల జాబితాను రెడీ చేశారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై-15న 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేయడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకంటున్నాయి. అయితే మిగిలిన 39 స్థానాల్లో పొత్తులో సర్దుబాటు, కొందరు సిట్టింగ్‌లను మార్చడం లాంటివి జరుగుతాయని తెలుస్తోంది. కేసీఆర్ చేయించిన సర్వేలు 40-45 శాతం వరకూ మార్కులు పడిన సిట్టింగ్‌లో ఈసారి కూడా టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. పాస్ మార్కులు పడినప్పటికీ ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితే లేదని గులాబీ బాస్ తేల్చి చెప్పేయబోతున్నారట. బహుశా ఆ టికెట్ ఇవ్వని జాబితాలో రాజయ్య పేరు కూడా ఉందేమోనని.. అందుకే ఆ విషయం తెలుసుకున్న కడియం ఇలా కామెంట్స్ చేస్తున్నారని నియోజకవర్గంలో కార్యకర్తలు, అభిమానులు చెప్పుకుంటున్నారు.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Rakesh Master : కంటతడి పెట్టిస్తున్న రాకేశ్ మాస్టర్ వీడియో.. శిష్యుడితో ఏం చెప్పారో విన్నాక..

Tollywood : రాకేష్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..




Updated Date - 2023-06-18T22:16:35+05:30 IST