Tollywood : రాకేష్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..

ABN , First Publish Date - 2023-06-18T19:49:34+05:30 IST

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rokesh Master) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు..

Tollywood : రాకేష్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rokesh Master) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం తన మిత్రులతో కలిసి వైజాగ్‌‌కు (Vizag) వెళ్లిన ఆయన.. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. ఈ టూర్‌లోనే అనారోగ్యానికి గురైన మాస్టర్.. అప్పట్నుంచీ స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇవాళ ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం, ఇంట్లో రక్తవిరోచనాలు చేసుకోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాకేశ్ ప్రాణాలను కాపాడటం కోసం వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినా.. అవేమీ ఫలించలేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు గాంధీ డాక్టర్లు (Gandhi Doctors) మీడియాకు వెల్లడించారు. రాకేశ్ మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆయన శిష్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

WhatsApp Image 2023-06-18 at 7.38.14 PM.jpeg

ఎలా చనిపోయారు..?

రక్త విరోచనాలు అవుతున్నాయని ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రాకేష్ మాస్టర్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. డయాబిటిక్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో రాకేశ్ మాస్టర్‌ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఆయన్ను బతికించాలని డాక్టర్ల చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మృతిచెందారు అని గాంధీ ఆస్పత్రి సూపరిడెంట్ రాజారావు మీడియాకు వెల్లడించారు. ఇదిలావుంటే.. విజయనగరంలోని ఓ ఫాంహౌస్‌లో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ జరిగింది. అయితే.. ఓ సీన్‌లో 20 ఫుల్ మందు బాటిల్స్ తాగారని.. అప్పట్నుంచే రాకేశ్ అస్వస్థతకు గురయ్యారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Rakesh-Ma.jpg

ఎవరీ మాస్టర్..?

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో రాకేశ్ 1968 జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు. ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేసిన ఆయన కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. టాలీవుడ్‌లో ఆయన 1500కు చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ అందించారు. శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ లాంటి వారికి శిక్షణ ఇచ్చాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’, ‘చిరునవ్వుతో’, ‘సీతయ్య’, ‘అమ్మో పోలీసోళ్ళు’ వంటి హిట్‌ చిత్రాలకు రాకేశ్‌ కొరియోగ్రఫీ అందించారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్‌ వేదికగా అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ట్రెండింగ్‌లో నిలిచారు.

Rakesh-Master.jpg

ప్రముఖుల సంతాపం..

రాకేశ్ మృతిపట్లు టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘ఎందరో కథానాయకులకు, కథానాయికలకు నాట్యంలో గురువుగా ఉన్న రాకేష్ మాస్టర్ ఇక లేరు అనే నిజం సినీ నాట్యశాస్త్రానికే లోటు.. మీ ఆత్మ పుణ్యలోకాలకు చేరుకోవాలని ఆ దైవాన్ని ప్రార్ధిస్తున్నాను’ అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు.

Rakesh Master: రాకేశ్‌ మాస్టర్‌ ఇకలేరు!

Updated Date - 2023-06-18T19:57:51+05:30 IST