Telugudesam : ఉంటే ఉండండి.. లేకుంటే తప్పుకోండి.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ ఒక్క మాటతో..

ABN , First Publish Date - 2023-06-19T17:46:34+05:30 IST

అవును.. తెలుగు తమ్ముళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.. పార్టీలో పనిచేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలని తేల్చిచెప్పేశారు. పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించారు..

Telugudesam : ఉంటే ఉండండి.. లేకుంటే తప్పుకోండి.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ ఒక్క మాటతో..

అవును.. తెలుగు తమ్ముళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.. పార్టీలో పనిచేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలని తేల్చిచెప్పేశారు. పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించారు. బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టీడీపీలోనే (Telugudesam) కాదు.. ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమైంది.. ఇప్పుడు పసుపు పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. సడన్‌గా చంద్రబాబు ఎందుకింతలా ఫైర్ అయ్యారు..? ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాబు ఎందుకింత కఠిన నిర్ణయం తీసుకున్నారు..? ఇంతకీ చంద్రబాబు టార్గెట్ ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)ప్రత్యేక కథనంలో చూద్దాం..

CBN-Warning.jpg

ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు..?

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈసారి ఎలాగైనా సరే వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనని యువగళం (Yuvagalam) పేరుతో ఓ వైపు యువనేత నారా లోకేష్.. (Nara Lokesh) మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. అయితే టీడీపీలోని కొందరు మాత్రం అసలు నియోజకవర్గంలో అసలేమీ పట్టనట్లుగా.. పార్టీలో కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సోమవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలిచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పార్టీలో పనిచేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలి. పనిచేయకుంటే కచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దు. తప్పుకునే వాళ్లు ఇప్పుడే తప్పుకుంటే వారిస్థానంలో వేరేవాళ్లను ప్లాన్ చేస్తాం. నేనేమీ గట్టిగా మాట్లాడటం లేదు.. పనిచేయకుంటే యాక్షన్ మాత్రమే తీసుకుంటానని చెబుతున్నాను’ అని తెలుగు తమ్ముళ్లను (Telugu Thammullu) చంద్రబాబు హెచ్చరించారు.

CBN-Flags.jpg

జగన్ గురించి ఇలా..!

గత కొన్నిరోజులుగా తనపై సీఎం జగన్ చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘తండ్రిని చంపిన కేసులో శిక్ష పడిన కొడుకు.. తండ్రి లేని బిడ్డని క్షమాభిక్ష పెట్టండని కోరాడట. జగన్ తీరు శిక్ష పడిన కొడుకులాగే ఉంది. తల్లి లేదు.. చెల్లి లేదు.. బాబాయ్ లేడు.. బీజేపీ కూడా లేదంటూ ఏదేదో కామెంట్లు చేస్తున్నారు. నేను ముసలివాడినా..? జగన్‌కు నాకున్న అనుభవమంత వయస్సు లేదు. సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. జగన్ కానీ.. వైసీపీ నేతలు గానీ ఏం మాట్లాడినా సరే టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లే వస్తున్నాయి. మరోవైపు పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ ఎండగడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే దానిపై జనాలకు చెప్పుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారు.

TDP.jpg

మొత్తానికి చూస్తే.. ఆ మధ్య మిని మేనిఫెస్టో ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. పార్టీలోని వ్యవహారాలను చక్కదిద్దే పనిలో పడ్డారన్న మాట. త్వరలోనే మరో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడానికి టీడీపీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. టీడీపీ మేనిఫెస్టో ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పై చైతన్య యాత్రను కూడా టీడీపీ ప్రారంభించింది. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌తో ఎంతమంది తెలుగు తమ్ముళ్లు దారిలోకొస్తారో.. ఎంతమంది పక్కకు తప్పుకుంటారో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


TS Politics : అవును అవినీతి పెరిగిపోయింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు.. సడన్‌గా ఎందుకిలా..!?


Rakesh Master : కంటతడి పెట్టిస్తున్న రాకేశ్ మాస్టర్ వీడియో.. శిష్యుడితో ఏం చెప్పారో విన్నాక..


Tollywood : రాకేష్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..


Updated Date - 2023-06-19T17:57:28+05:30 IST