Visa Fee: యూకే వీసాల ఫీజు పెంపు.. నేటి నుంచి అమల్లోకి..

ABN , First Publish Date - 2023-10-04T07:56:27+05:30 IST

స్టూడెంట్స్‌, పర్యాటలకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసాల ఫీజును బ్రిటన్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు యూకే హోం ఆఫీస్ ప్రకటించినట్లు నేటి (బుధవారం) నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.

Visa Fee: యూకే వీసాల ఫీజు పెంపు.. నేటి నుంచి అమల్లోకి..

లండన్: స్టూడెంట్స్‌, పర్యాటలకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసాల ఫీజును బ్రిటన్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు యూకే హోం ఆఫీస్ ప్రకటించినట్లు నేటి (బుధవారం) నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆరు నెలలలోపు విజిట్ వీసా ఫీజు (Visit Visa Fee) గతంలో 100 పౌండ్స్ ఉంటే, ఇప్పుడు దాన్ని 115 పౌండ్స్‌కు పెంచింది. అలాగే స్టూడెంట్ వీసా రుసుము (Student Visa Fee) ఇంతకుముందు 363 పౌండ్లు ఉండగా తాజాగా 490 పౌండ్లకు పెరిగింది. ఇక తాజా పెంపుతో విజిటర్ వీసా దరఖాస్తు రుసుము రూ.11,835కు చేరితే.. స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజు రూ. 50,428కి చేరింది.

పార్లమెంటు ఆమోదానికి లోబడి ఇమ్మిగ్రేషన్, జాతీయత రుసుములు అక్టోబర్ 4 నుండి పెరుగుతాయని హోం ఆఫీస్ (Home Office) ప్రకటించింది. "సుస్థిరమైన ఇమ్మిగ్రేషన్, జాతీయత వ్యవస్థను అమలు చేయడానికి వసూలు చేయబడిన వీసా రుసుముల నుండి వచ్చే ఆదాయం కీలక పాత్ర పోషిస్తుంది" అని ఈ సందర్భంగా హోం ఆఫీస్ తెలియజేసింది. ఇక తాజా నిర్ణయంతో వర్క్, సందర్శన వీసాల ధరలో 15శాతం పెరుగుదల ఉంటే.. ప్రాధాన్యత వీసాలు, స్టడీ వీసాలు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్‌ల ధరలో కనీసం 20శాతం పెరుగుదల ఉంటుందని హోమ్ ఆఫీస్ పేర్కొంది. కాగా, భారీగా పెరిగిన వీసాల ఫీజు బ్రిటన్ వెళ్లే విద్యార్థులు, పర్యాటకులకు భారం కానుంది.

Kuwait: గల్ఫ్ దేశంలో ఊహించని పరిణామం.. అపార్ట్‌మెంట్స్ ఖాళీ.. బోరుమంటున్న యజమానులు..!

Updated Date - 2023-10-04T07:56:27+05:30 IST