Kuwait: గల్ఫ్ దేశంలో ఊహించని పరిణామం.. అపార్ట్‌మెంట్స్ ఖాళీ.. బోరుమంటున్న యజమానులు..!

ABN , First Publish Date - 2023-10-03T08:04:25+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీ నుంచి ప్రతి విషయంలో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

Kuwait: గల్ఫ్ దేశంలో ఊహించని పరిణామం.. అపార్ట్‌మెంట్స్ ఖాళీ.. బోరుమంటున్న యజమానులు..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీ నుంచి ప్రతి విషయంలో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక ఐదేళ్ల కింద తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ని కూడా ఇటు ప్రభుత్వ రంగంతో పాటు అటు ప్రైవేట్ రంగంలో కూడా కఠినంగానే అమలు చేస్తోంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రవాసులు (Expats) భారీ మొత్తంలో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. దీంతో గడిచిన రెండేళ్ల నుంచి ఆ దేశంలో ప్రవాసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అలాగే కొత్తవాళ్లు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే కువైత్‌ వెళ్తున్నారు.

ఇక భారీ మొత్తంలో వలసదారులు ఉద్యోగాలు కోల్పోయి స్వదేశాలకు తిరిగి వెళ్తుండడంతో అక్కడి అపార్ట్‌మెంట్స్ (Apartments) ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో ఏకంగా 50వేల వరకు నివాస గృహాలు ఖాళీ అయినట్లు తెలిసింది. అలాగే అపార్ట్‌మెంట్స్ అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. దాంతో రియల్‌ ఎస్టేట్ ఏకంగా 363 మిలియన్ దినార్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. 2020 రెండో త్రైమాసికం తర్వాత నుంచి ఇదే అత్యల్పం. కాగా, ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రవాస జనాభా వృద్ధి రేటులో భారీ వార్షిక క్షీణత నమోదైంది. అంతకుముందు ఐదేళ్లు జనాభా వృద్ధి 5 శాతంగా ఉంటే.. గత సంవత్సరంలో దాదాపు 1.8 శాతానికి పడిపోయింది. ఇదిలాఉంటే.. కువైత్‌లో ఆ దేశ జనాభా కంటే కూడా ప్రవాసులే అధిక సంఖ్యలో ఉంటారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కసారిగా భారీ మొత్తంలో వలసదారులు వారివారి దేశాలకు తిరిగి వెళ్లిపోవడంతో జన సంఖ్యలోనూ భారీగా తేడాలు కనిపిస్తున్నాయి.

Saudi Arabia: సౌదీలో స్కూల్ విద్యార్థినికి 18ఏళ్ల జైలు.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..

Updated Date - 2023-10-03T08:04:38+05:30 IST