Kuwait: దేశం నుంచి బహిష్కరించిన ప్రవాసుల విషయంలో.. తీవ్ర ఆందోళనలో కువైత్ బ్యాంకులు..!

ABN , First Publish Date - 2023-10-06T09:10:31+05:30 IST

కువైత్‌లోని బ్యాంకులు (Banks in Kuwait) దేశం నుంచి బహిష్కరించబడిన ప్రవాసుల (Deported expatriates) కు చెందిన బ్యాంకు ఖాతాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

Kuwait: దేశం నుంచి బహిష్కరించిన ప్రవాసుల విషయంలో.. తీవ్ర ఆందోళనలో కువైత్ బ్యాంకులు..!

కువైత్ సిటీ: కువైత్‌లోని బ్యాంకులు (Banks in Kuwait) దేశం నుంచి బహిష్కరించబడిన ప్రవాసుల (Deported expatriates) కు చెందిన బ్యాంకు ఖాతాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఆయా ఖాతాల ద్వారా దోపిడీతో పాటు పౌరులు, నివాసితులపై ఆర్థిక మోసపూరిత కార్యకలాపాలకు అవకాశం ఉందని ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బహిష్కరణకు గురైన ప్రవాస కార్మికుల (Expat Workers) పేర్లను వారి బ్యాంకింగ్ వ్యవస్థలను సెక్యూర్ చేయడానికి వారు ఒక ప్రత్యేక భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పరిశీలిస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా ఏజెన్సీ ఒకటి వెల్లడించింది.

ఆ మీడియా ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుండి కువైత్ (Kuwait) నుండి బహిష్కరించబడిన ప్రవాసులకు సంబంధించిన సుమారు 30,000 బ్యాంక్ ఖాతాలు (Bank Accounts) ఉన్నాయి. ఇవి ఆర్థిక వ్యవస్థకు భద్రతా పరమైన సమస్యలను కలిగించే అవకాశం లేకపోలేదు. మోసపూరిత కార్యకలాపాలకు ఎక్కువ మంది ప్రవాస కార్మికులను రిక్రూట్ చేసే ఆర్థిక మోసాల ముఠాలు ఈ ఖాతాలను ఉపయోగించుకుంటాయని బ్యాంకులు భయపడుతున్నాయి.

ఇదిలాఉంటే.. గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అన్నంత పని చేస్తోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రవాసులపై వేటు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ మొత్తంలో ప్రక్షాళన మొదలెట్టింది. దీనికోసం ఐదేళ్ల కింద కువైత్ సర్కార్ కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌లోని అన్నీ విభాగాలలో కువైటీలకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. దాంతో ఇప్పటివరకు కువైత్‌లో భారీగా ఉపాధి పొందిన ప్రవాసులు (Expatriates) ఇప్పుడు అదే స్థాయిలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీంతో గడిచిన రెండుమూడేళ్ల నుంచి ప్రవాస కార్మికులు భారీ మొత్తంలో కువైత్‌ను విడిచిపెడుతున్నారు.

Indian Embassy: కువైత్‌లోని భారతీయ నర్సులకు ఎంబసీ కీలక సూచన.. అలా చేయకపోతే పరాయి దేశంలో తిప్పలు తప్పవని హెచ్చరిక!


Updated Date - 2023-10-06T09:11:58+05:30 IST