Share News

NRI News: లండన్‌లో ఘోరం.. భారతీయ యువతిని పొడిచి చంపిన దుండగుడు.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..!

ABN , First Publish Date - 2023-10-31T09:17:23+05:30 IST

బ్రిటన్ రాజధాని లండన్‌ (London) లో ఘోరం జరిగింది. భవిష్యత్‌పై ఎన్నో కలలతో ఇటీవలే యూకే (UK) వెళ్లిన 19ఏళ్ల భారతీయ యువతి దారుణ హత్యకు (Brutal Muder) గురయింది.

NRI News: లండన్‌లో ఘోరం.. భారతీయ యువతిని పొడిచి చంపిన దుండగుడు.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..!

NRI News: బ్రిటన్ రాజధాని లండన్‌ (London) లో ఘోరం జరిగింది. భవిష్యత్‌పై ఎన్నో కలలతో ఇటీవలే యూకే (UK) వెళ్లిన 19ఏళ్ల భారతీయ యువతి దారుణ హత్యకు (Brutal Muder) గురయింది. ఆదివారం సౌత్ లండన్‌లోని ఓ ఇంట్లో శవమై కనిపించింది. ఆమెను ఓ దుండగుడు అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తు చేసి ఆమెకు తెలిసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకుడు అదే స్థలంలో గాయపడినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు మృతురాలి వివరాలను వెల్లడించలేదు. కానీ, ఆమె కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!

ఇక అదుపులోకి తీసుకున్న హంతకుడి వయస్సు 23 ఏళ్లు. అతడి తలకు చిన్న గాయమైంది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విచారణ అనంతరం హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం (బ్రిటన్ కాలమానం ప్రకారం) సౌత్ లండన్‌లోని క్రోయిడాన్ అనే నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో భారతీయ యువతి (Indian Woman) చనిపోయిందన్న సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్న యువతిని గుర్తించిన పోలీసులు ఆమె అక్కడికక్కడే చనిపోయినట్లు మెట్రోపాలిటన్ పోలీసు ప్రతినిధి ఒకరు ప్రకటించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా? లేదా చోరీ యత్నమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

India-UAE travel: యూఏఈ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. మీ లగేజీలో ఈ వస్తువులుంటే.. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..!

Updated Date - 2023-10-31T09:17:23+05:30 IST