Share News

Kuwait: తగ్గేదేలే.. 3నెలల్లో 12వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

ABN , First Publish Date - 2023-10-31T07:15:28+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.

Kuwait: తగ్గేదేలే.. 3నెలల్లో 12వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు నిర్వహిస్తున్న ఆ దేశ భద్రతాధికారులు ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడం (Deported) చేస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన మూడు నెలల్లో ఏకంగా 12వేల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తాజాగా వెలువడిన అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) గణాంకాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిపిన సోదాల్లో ఈ మేరకు ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి వెళ్లగొట్టింది.

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!


వీరిలో కొందరు ప్రజా నైతిక చట్టాలను ఉల్లంఘించిన వారు (Violating public morals) ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే రెసిడెన్సీ, కార్మిక చట్టాల ఉల్లంఘనదారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిపింది. మరికొందరు మార్జినల్ వర్కర్స్, యజమానుల నుంచి పారిపోయిన వారు ఉన్నారని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇకపై కూడా ఈ సెక్యూరిటీ తనిఖీ (Security campaigns) లు ఇలాగే కొనసాగుతాయని, ఎట్టిపరిస్థితుల్లో అక్రమంగా దేశంలో ఉంటున్నవారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. ప్రధానంగా వలసదారులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాలు, వలసతి గృహాలలో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు, భద్రతా సిబ్బంది సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి.

India-UAE travel: యూఏఈ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. మీ లగేజీలో ఈ వస్తువులుంటే.. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..!

Updated Date - 2023-10-31T07:15:28+05:30 IST