Share News

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!

ABN , First Publish Date - 2023-10-28T11:39:19+05:30 IST

గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. ఆ తర్వాత అది కఠిన శిక్షల వరకు వెళ్తుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!

ఎన్నారై డెస్క్: గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. ఆ తర్వాత అది కఠిన శిక్షల వరకు వెళ్తుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. లేనిపక్షంలో మనం తెలియకుండా చేసే పొరపాటు కూడా మనల్ని భారీ మూల్యం చెల్లించేకునేలా చేస్తుంది. ఇక జీసీసీ (Gulf Cooperation Council) దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, కువైత్, యూఏఈ, బహ్రెయిన్, ఒమాన్‌లో సైతం ఇంచుమించు ఒకే రకమైన చట్టాలను అమలు చేస్తుంటాయి. ఆయా దేశాలకు వెళ్లే ముందు అక్కడి చట్టాల గురించి కొంతమేర తెలుసుకుంటే బెటర్. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

ఇదే కోవలో తాజాగా ఖతర్ దేశం ఎనిమిది మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఖతర్‌కు చెందిన అల్‌ దహ్రా కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వీరిని గతేడాది ఆగస్టులో రాజధాని దోహాలో అరెస్టు చేశారు. అయితే, వారిపై ఉన్న అభియోగాలను ఇప్పటివరకూ బహిరంగపరచలేదు. పలుమార్లు విచారణ అనంతరం స్థానిక కోర్టు మరణశిక్ష విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఇదిలాఉంటే.. అసలు ఖతర్‌‌లో చట్టాలు ఎంత ఇంత కఠినంగా ఉంటాయి..? అక్కడ ఏమేం చేయకూడదు..? ముఖ్యంగా ఖతర్‌లో చట్ట విరుద్ధంగా భావించే తొమ్మిది పనులు ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం.

* స్వలింగ సంపర్కం..

ఆ దేశంలో స్వలింగ సంపర్కం అనేది చట్టవిరుద్ధం. ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లో స్వలింగ సంపర్క ప్రవర్తన అనేది నేరం. ప్రైవేట్ లైఫ్‌కి విలువనిస్తూనే అక్కడ ఈ విషయంలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇక బహిరంగ ప్రదేశంలో సాన్నిహిత్యంగా మెలగడం కూడా అక్కడ నేరంగా పరిగణించబడుతుంది. ఏదైనా లైంగిక ధోరణి ఉన్న వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. అంతేందుకు ఎల్‌జీబీక్యూ+ (LGBTQ+) తో సహా పెళ్లికాని స్నేహితులు లేదా జంటలు ఒకే గదిలో ఉండడంపై ఆ దేశంలో ఆంక్షలు ఉంటాయి.

India-UAE travel: యూఏఈ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. మీ లగేజీలో ఈ వస్తువులుంటే.. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..!

* మద్యం..

బహిరంగంగా మద్యం సేవించడం నేరంగా పరిగణిస్తారు. గతంలో పర్యాటకులు ఖతర్‌లో ఈ విషయమై అరెస్టు చేయబడ్డారు కూడా. సాధారణంగా అభ్యంతరకరమైన ప్రవర్తన లేదా మద్యం తాగి విచక్షణరహితంగా ప్రవర్తించడం దీని కిందికి వస్తాయి. దీనికిగాను అక్కడ 3వేల ఖతారీ రియాల్స్ (రూ.68వేలు) వరకు జరిమానా, 6నెలల జైలు శిక్ష ఉంటుంది. ఇక లైసెన్స్ పొందిన బార్‌లు, రెస్టారెంట్‌లలో మాత్రమే అక్కడ ప్రజలు చట్టబద్ధంగా మద్యం కొనుగోలు చేయొచ్చు. ఆ దేశంలో చట్టపరమైన మద్యపాన వయస్సు వచ్చేసి 21 ఏళ్లు. అలాగే మద్యం కొనుగోలు చేయడానికి ఫోటో ఐడీ (Photo ID తప్పనిసరి.

* మాదకద్రవ్యాలను కలిగి ఉండడం లేదా రవాణా..

ఖతర్‌లో మాదకద్రవ్యాలను కలిగి ఉండడం లేదా రవాణా చేయడం అనేది క్షమించరాని నేరం. అంతేందుకు కొన్ని రకాల మెడిసిన్స్‌ను కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు. కొన్ని ప్రిస్క్రిప్షన్ మందులు ఈ నియమం కిందకు వస్తాయి. మందులు తీసుకువెళ్లేవారు అధికారిక ప్రిస్క్రిప్షన్లకు సంబంధించి ఆసుపత్రి నోట్ లేదా అధికారిక ధృవపత్రాన్ని తీసుకువెళ్లాలి. ట్రాఫికింగ్, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా లాంటి వాటికి అక్కడ భారీ జరిమానాలు, దేశ బహిష్కరణ ఉంటాయి.

* అభ్యంతరకర ప్రవర్తన..

తిట్టడం, అసభ్యకరంగా దుర్భాషలాడడం అక్కడ చట్టవిరుద్ధం. వాటిని అశ్లీల చర్యలుగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారు జైలు శిక్షతో పాటు ఏకంగా దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక పోలీసులను ఉద్దేశించి ఈ ప్రవర్తన ఉంటే మాత్రం ఈ శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి.

* కొన్ని పరిస్థితులలో ఫోటోగ్రఫీ..

మతపరమైన, సైనిక, నిర్మాణ స్థలాల వంటి సున్నితమైన ప్రాంతాలను చిత్రీకరించడం, ఫొటో తీయడం నేరం. ఈ విషయమై గతంలో కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. సందర్శకులు ఏదైనా మీడియాను తీసుకునే ముందు అనుమతి తీసుకోవాలనేది అక్కడి ప్రభుత్వం సూచన. ఖతర్‌లో ప్రైవసీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అవమానకరమైన, అపవాదు, సాంస్కృతికంగా సున్నితత్వమైన విషయాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం ఖతర్ చట్టం ప్రకారం క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది.

Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్

* వివాహేతర సంబంధాలు..

స్త్రీ, పురుషుల మధ్య బహిరంగ సాన్నిహిత్యం నేరం. ఇది అరెస్టుకు దారితీయవచ్చు. అలాగే అవివాహితులు జంటగా జీవించడం ఆ దేశంలో చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. వివాహానికి ముందు శృంగారం, స్వలింగ సంపర్కం అనేది అక్కడ ఒక క్రిమినల్ నేరం. ఇది అరెస్ట్ లేదా కోర్టు కేసుకు దారి తీయవచ్చు. ఈ నేరానికి సంబంధించిన భారీ జరిమానా, కస్టడీ శిక్ష, శిక్ష తర్వాత దేశ బహిష్కరణ వంటివి ఉంటాయి.

* పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం..

వివాహ నిబంధనలను అతిక్రమించి ఓ యువతి, యువకుడు సంబంధంలో ఉండి, యువతి గర్భం దాలిస్తే వారిద్దరినీ జైలులో పెట్టవచ్చు. ఆ తర్వాత దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది.

* అనుచిత డ్రెస్సింగ్..

సందర్శకులు బహిరంగ ప్రదేశాల్లో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పిఉండే దుస్తులు ధరించాలి. మహిళలు తమ భుజాలను పూర్తిగా కప్పుకోవాలి. పొట్టి స్కర్టులు ధరించడం చేయకూడదు. ప్రభుత్వ భవనాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, షాపింగ్ మాల్స్‌లోకి వెళ్లేటప్పుడు పురుషులు, మహిళలు షార్ట్‌లు లేదా స్లీవ్‌లెస్ షర్టులు ధరించరాదు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిని ఈ ప్రదేశాలలో ప్రవేశాన్ని నిరాకరించడం జరుగుతుంది.

NRI: నెట్టింట లేడీ ఎన్నారై లవ్‌స్టోరీ వైరల్.. సైన్స్ కథనంతో మొదలై.. రొమాన్స్ వరకు

Updated Date - 2023-10-28T13:39:26+05:30 IST