Jailer: ఇదెక్కడి అభిమానంరా నాయనా! జైలర్ సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇచ్చారని చితకబాదిన రజినీ అభిమానులు.. వీడియో ఇదిగో!

ABN , First Publish Date - 2023-08-10T21:36:04+05:30 IST

గురువారం రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా నచ్చని ఇద్దరు అభిమానులు మీడియాకు నెగెటివ్ రివ్యూ ఇవ్వడాన్ని తలైవా అభిమానులు జీర్ణించులేకపోయారు. వారిద్దరిపై భౌతిక దాడికి దిగారు.

Jailer: ఇదెక్కడి అభిమానంరా నాయనా! జైలర్ సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇచ్చారని చితకబాదిన రజినీ అభిమానులు.. వీడియో ఇదిగో!

చెన్నై: సినిమా హీరోలకు చాలా మంది అభిమానులు.. కాదు కాదు వీరాభిమానులు ఉంటారు. వారంతా తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజున సంబరాలు చేస్తారు. భారీ ఎత్తున కటౌట్లు కట్టి, టపాసులు పేల్చి, పాలాభిషేకాలు కూడా చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వారు తమ హీరోల కోసం ప్రాణాలైనా ఇస్తారేమో అనే స్థాయిలో ప్రవర్తిస్తుంటారు. కానీ ఈ అభిమానం ఇటీవల హద్దులు దాటుతుండడం ఆందోళన కల్గిస్తోంది. తమ హీరోలపై అభిమానంతో ఇతర హీరోల అభిమానులను దూషించడం మనం ఇప్పటికే చూస్తున్నాం. అది సరిపోదనట్టు తమ హీరో సినిమాపై నెగెటివ్ రివ్యూలు ఇవ్వడాన్ని కూడా పలువురు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిపై బహిరంగంగా భౌతిక దాడులకు పాల్పడుతుండడం గమనార్హం. జూన్ 16న ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన పాన్ ఇండియా సినిమా ‘‘ఆదిపురుష్’’ (Adipurush) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద ఓ వ్యక్తి మీడియాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చాడని అతనిపై అభిమానులు భౌతిక దాడి చేయడం ఆందోళన కల్గించింది. అది మర్చిపోక ముందే అచ్చం అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఈ గురువారం రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా నచ్చని ఇద్దరు అభిమానులు మీడియాకు నెగెటివ్ రివ్యూ ఇవ్వడాన్ని తలైవా అభిమానులు జీర్ణించులేకపోయారు. వారిద్దరిపై భౌతిక దాడికి దిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నెగిటివ్ రివ్యూ చెప్పింది తమిళనాట మరో స్టార్ హీరో అయిన విజయ్ అభిమానులు అని రజినీ కాంత్ అభిమానులు ఆరోపిస్తున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని క్రోమ్‌పేట ప్రాంతంలోని వెట్రీ థియేటర్‌లో రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాను విడుదల చేశారు. దీంతో ఆ థియేటర్ వద్ద అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సినిమా మ్యూజిక్ డైరైక్టర్ అనిరుధ్(anirudh ravichander) కూడా అక్కడికి వచ్చి అభిమానులతో సందడి చేశాడు. అంతేకాకుండా అభిమాలతో ‘హుకుం’ పాట కూడా పాడాడు. కానీ ఫస్ట్ షో ముగిశాక ఒక ఇద్దరు వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి నెగెటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన రజినీ అభిమానులు వారిద్దరిని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెగెటివ్ రివ్యూ ఇచ్చిన ఆ ఇద్దరు తమిళనాడులో మరో స్టార్ హిరో అయినా ఇలయ దళపతి విజయ్ అభిమానులు అని రజినీ అభిమానులు ఆరోపిస్తున్నారు. కావాలనే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

కాగా కొన్ని రోజులుగా తమిళంలో రజనీకాంత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది. జైలర్ ఆడియో లాంచ్ సందర్భంగా రజనీకాత్ చేసిన కామెంట్సే అభిమానుల మధ్య ఈ వివాదానికి ఆజ్యం పోసిందిన. జైలర్ ఆడియో లాంచ్ సందర్భంగా రజనీ కాంత్ మాట్లాడుతూ.. ‘‘నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar) దర్శకత్వంతో విజయ్ నటించిన ‘బీస్ట్’(Beest) సినిమాకు పాజిట్ రివ్యూలు రాలేదు. దీంతో నెల్సన్‌తో కలిసి పని చేసే విషయమై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని నా సన్నిహితులు నాకు సలహా ఇచ్చారు.’’ అని బహిరంగంగా మాట్లాడారు. అయితే ఇది విజయ్ అభిమానులకు నచ్చలేదు. దీంతో విజయ్, రజినీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవాలి. కాగా విజయ్ నటించిన బీస్ట్ సినిమాకు కూడా నెల్సన్ దిలీప్ కుమారే దర్శకుడు అనే సంగతి తెలిసిందే.

Updated Date - 2023-08-10T21:36:04+05:30 IST