Karnataka Election 2023 : పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-29T18:35:12+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్

Karnataka Election 2023 : పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
DK Shiv Kumar, Karnataka Congress

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (Karnataka Congress president DK Shivakumar) చెప్పారు. ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం లేదన్నారు. ఒక పార్టీకి మాత్రమే ఆధిక్యత లభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారం చేపడుతుందనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కేవలం మత రాజకీయాలను మాత్రమే చేస్తోందన్నారు.

కర్ణాటకలో 224 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు మే 10న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని, మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. 80 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా విడుదల చేశారు. డీకే శివ కుమార్ బంధువు శరత్ చంద్ర ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చన్నపట్న నుంచి పోటీ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో శివ కుమార్ మాట్లాడుతూ, తమకు ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని రానివ్వండన్నారు. తాను ఆ పార్టీని స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే ఆ పార్టీకి విజయం లభించబోదని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!

UPI Transactions : డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలా? అమ్మో!

Updated Date - 2023-03-29T18:35:12+05:30 IST