Chintamaneni Prabhakar: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తాం’

ABN , First Publish Date - 2023-03-22T11:52:14+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Chintamaneni Prabhakar: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తాం’

ఏలూరు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) పై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Deduluru former MLA Chintamaneni Prabhakar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (CM Jagan) దొంగ హామీలు ఇచ్చారని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Elections)ల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక (Assembly Elections) ల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి జగన్ పేదలను మోసం చేశారన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తయినా నాలుగేళ్లు నుంచి లబ్ధిదారులలకు ఇవ్వకుండా సైకోలా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి చేస్తే సైకోలా జగన్ నవ్వుతున్నారన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని... దీనికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ (TDP) ఘనవిజయం అని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-22T11:52:14+05:30 IST