Nara Lokesh: అధికారంలోకి వచ్చాక ఫ్లెక్సీ ప్రింటింగ్‌లను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2023-04-21T16:52:22+05:30 IST
ముఖ్యమంత్రిగా జగన్ కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా.. ఫ్లెక్సీ ప్రింటింగ్‌పై నిషేధం విధిస్తూ జీవోలు తెచ్చి లక్షలాది మంది పొట్టగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ యువనేత నారా లోకేష్
కర్నూలు: ముఖ్యమంత్రిగా జగన్ కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా.. ఫ్లెక్సీ ప్రింటింగ్‌పై నిషేధం విధిస్తూ జీవోలు తెచ్చి లక్షలాది మంది పొట్టగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా యువనేతను ప్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఫ్లెక్సీ ప్రింటింగ్‌పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం. 65, 75లను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తున్నట్లు తెలిపారు. తాము ముద్రించే ప్లెక్సీలు 180 మైక్రాన్‌ల పరిమాణంలో ఉంటాయని.. అలాగే ఫ్లెక్సీ ప్రింటింగ్ వృత్తిని కుటీర పరిశ్రమగా గుర్తించి.. ప్రభుత్వ రాయితీలు అందించాలని యువనేతను అభ్యర్థించారు.
నారా లోకేష్ మాట్లాడుతూ...
ముఖ్యమంత్రిగా జగన్ (CM JAGAN) కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా.. ప్లెక్సీ ప్రింటింగ్‌పై నిషేధం విధిస్తూ జీవోలు తెచ్చి లక్షలాది మంది పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఫ్లెక్సీలను బ్యాన్ చేయడం దారుణం అని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్లెక్సీలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. నిబంధనలకు లోబడి ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లకు సహకారం కూడా అందించనున్నట్లు నారా లోకేష్ భరోసా ఇచ్చారు.