NCBN ARREST: చంద్రబాబు కస్టడీపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు

ABN , First Publish Date - 2023-09-20T17:08:30+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను ఈరోజు ఏసీబీ కోర్టు (ACB Court) మరోసారి విచారించింది.

NCBN ARREST: చంద్రబాబు కస్టడీపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను ఈరోజు ఏసీబీ కోర్టు (ACB Court) మరోసారి విచారించింది. విచారణ సందర్భంగా టీడీపీ నేతలు తీవ్ర టెన్షన్‌కు లోనయ్యారు. ఏసీబీ కోర్టు లోపల సిద్దార్ధ లూథ్రా, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య వాదనలు వాడివేడిగా జరిగాయి. చంద్రబాబును ఒకవేళ కస్టడీకి ఇస్తే తర్వాత జరిగే పరిణమాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

లూథ్రా ఏమన్నారంటే..

చంద్రబాబు తరపున లాయర్‌ సిద్దార్ధ లూథ్రా(Siddhartha Ludra) ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది.NSG భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు.ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును కస్టడీకి కోరుతున్నారు. చంద్రబాబుకు పోలీసు కస్టడీ అవసరం లేదు.నాలుగేళ్లుగా ఎవరినీ అరెస్టు చేసినా... నిధులు దుర్వినియోగం పేరే చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగింది. ఏసీబీ విచారణలో కొత్త కోణం కోర్టు ముందు పెట్టలేక పోయారు’’ అని సిద్దార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు.

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలి: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

కాగా... ‘‘ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(AAG Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. చంద్రబాబు కస్టడీ(Custody)కి ఇవ్వాలని కోరుతూ ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలి.కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం. చంద్రబాబును మరోసారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉంది. కేసులో ఇంకా పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది’’ అని ఏఏజీ సుధాకర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు.

Updated Date - 2023-09-20T17:18:26+05:30 IST