Nara Lokesh: ఆరునెలల్లో దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్
ABN , First Publish Date - 2023-09-25T18:28:30+05:30 IST
ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తే మూడు నెలలు, షెడ్యూల్ ప్రకారం జరిగితే ఆరునెలల్లో సైకో జగన్(Jagan) దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అవబోతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సెటైర్లు వేశారు.

అమరావతి: ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తే మూడు నెలలు, షెడ్యూల్ ప్రకారం జరిగితే ఆరునెలల్లో సైకో జగన్(Jagan) దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అవబోతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సెటైర్లు వేశారు. సోమవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘‘మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు, నువ్వెంత?.నీ అధికార మదం ఎంత సైకో జగన్?. ఐటీ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దులో యుద్ధవాతావరణం సృష్టించావు. అంగన్వాడీ వర్కర్స్ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే, మహిళలు అని చూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధం అమలు చేశావు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తెలుగుదేశం శ్రేణులపై ఉక్కుపాదం మోపుతున్నావు. ప్రభుత్వ అరాచక విధానాలు ప్రశ్నిస్తే దౌర్జన్యం, నిలదీస్తే నిర్బంధం. ప్రజాతిరుగుబాటుని అణిచివేస్తే, అధికమవుతుంది. నీ అరాచక పాలన అంతం ఖాయం. ఖాకీలని అడ్డుపెట్టుకుని ఇంకెన్నాళ్లీ ఫ్యాక్షన్ స్వామ్యం సైకో జగన్!’’ అని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.