Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయం
ABN , First Publish Date - 2023-09-22T17:08:37+05:30 IST
మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం లోకేష్. రాజమండ్రికి తిరిగి రావాలి అనుకున్నారు. కాగా హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి.సుప్రీం కోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం అయిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్, తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేష్. చర్చిస్తున్నారు.