Chinarajappa: బాబు-పవన్ కలిస్తే వైసీపీ అడ్రస్ గల్లంతే

ABN , First Publish Date - 2023-01-08T16:15:50+05:30 IST

చంద్రబాబు (Chandrababu)- పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీపై మంత్రులు (YCP Ministers) చేసిన వ్యాఖ్యలపై మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. ఆయన మీడియాతో

Chinarajappa: బాబు-పవన్ కలిస్తే వైసీపీ అడ్రస్ గల్లంతే
వైసీపీ అడ్రస్ గల్లంతే

అమరావతి: చంద్రబాబు (Chandrababu)- పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీపై మంత్రులు (YCP Ministers) చేసిన వ్యాఖ్యలపై మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు. ఇద్దరు కలిస్తే ఓడిపోతామన్న భయంతోనే మీరు అలా మాట్లాడుతున్నట్టు ఉంది. జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో మీరు విశాఖలో ఇబ్బందులకు గురి చేశారు. ఆ రోజు చంద్రబాబు.. పవన్‌ను పలకరించాలని వెళ్లారు. ఇప్పుడు కుప్పంలో ఆంక్షలు పెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై చంద్రబాబును పలకరించడానికి పవన్ వెళ్తే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఆనాడు కలయిక పైనా కూడా ఇలాగే అవాకులు, చెవాకులు పేలారు. ఇప్పుడూ అదే తరహాలో విమర్శలు చేస్తున్నారు. టీడీపీ - జనసేన కలిస్తే మీకు వచ్చే ఎన్నికల్లో అడ్రస్ ఉండదనే భయంతోనే నోటికొచ్చినట్లు మంత్రులు, వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. 2014లో జనసేనతో టీడీపీ కలిసి వెళ్లింది.’’ అని ఆయన గుర్తుచేశారు.

చంద్రబాబు-పవన్‌కల్యాణ్ భేటీపై మంత్రులు ఏమన్నారంటే...

11.gif

12.gif

Updated Date - 2023-01-08T16:16:14+05:30 IST