Chandrababu: చంద్రబాబు ఇంట్లో ముగిసిన చండీ, సుదర్శన నారసింహ హోమాలు
ABN , Publish Date - Dec 24 , 2023 | 08:46 PM
తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఏపీలోని ఉండవల్లిలోని నివాసంలో మూడురోజల క్రితం చేపట్టిన చండీయాగం, సుదర్శన నారసింహ హోమాలు ఆదివారం నాడు ముగిశాయి. మూడు రోజుల పాటు వైభవంగా యాగాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం ( ఈరోజు) వరకు మూడు రోజుల పాటు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా చేపట్టిన పలు యజ్ఞ క్రతువులు ముగిశాయి.
అమరావతి: తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఏపీలోని ఉండవల్లిలోని నివాసంలో మూడురోజల క్రితం చేపట్టిన చండీయాగం, సుదర్శన నారసింహ హోమాలు ఆదివారం నాడు ముగిశాయి. మూడు రోజుల పాటు వైభవంగా యాగాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం ( ఈరోజు) వరకు మూడు రోజుల పాటు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా చేపట్టిన పలు యజ్ఞ క్రతువులు ముగిశాయి.

ఆదివారం (ఈరోజు) మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని చంద్రబాబు కోరుకున్నారు. గుంటూరుకు చెందిన వేద పండితులు పి.శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు అత్యంత వైభవంగా ఈ యాగాలు నిర్వహించారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి ఈ యాగంలో పాల్గొన్నారు.


