Roja: డైమండ్‌రాణి వ్యాఖ్యలపై రోజా సీరియస్.. లోకేష్‌ను అంకుల్ అంటూ...

ABN , First Publish Date - 2023-02-01T12:19:51+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డైమండ్ రాణి వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Roja: డైమండ్‌రాణి వ్యాఖ్యలపై రోజా సీరియస్.. లోకేష్‌ను అంకుల్ అంటూ...

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) డైమండ్ రాణి వ్యాఖ్యలపై మంత్రి రోజా (AP Minister Roja) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘లోకేష్ అంకుల్’’ అంటూ రోజా విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... యువగళం (LokeshYuvaGalam) ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకొని హైదరాబాద్‌ (Hyderabad)లో దాచుకోవడమే కాకుండా మళ్ళీ తండ్రిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నారన్నారు.

ఒకవైపు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కాంగ్రెస్‌ (Congress)తో కుమ్మక్కై వేధించినప్పటికీ జగనన్న (YCP Chief YS JaganMohan Reddy) ఆత్మస్థైర్యంతో పాదయాత్రను ప్రారంభించారని అన్నారు. పేదల కష్టాలను వింటూ అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా ఆ కష్టాలను తీరుస్తున్నారని తెలిపారు. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఓట్లు అడుగుతున్నామని మంత్రి చెప్పారు.

రోజా ఇంకా మాట్లాడుతూ... ‘‘మీ తండ్రీకొడుకులు మీకవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని (Nandamuri Family) వాడుకొని, అధికారం వచ్చాక వాళ్ళను విస్మరిస్తున్నారు. అది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. నీ సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే పది మంది కూడా నీతో లేకుండా పాదయాత్ర చేస్తావు. నీది యువగళం (YuvaGalamPadayatra) కాదు ఒంటరిగళం. నువ్వు లీడర్‌గా వంద శాతం ఫెయిల్యూర్. ఇది మంగళగిరి ప్రజలు గుర్తించే నిన్ను ఓడించారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని రికార్డు లోకేష్‌ (NaraLokesh) ది’’ అంటూ రోజా ధ్వజమెత్తారు.

కాగా... యువగళం పాదయాత్ర తొలినాళ్లలో రోజాపై లోకేష్ (NaraLokeshForPeople) విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ‘‘వైసీపీ (YCP)లో ఉన్న మహిళా నాయకురాలు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను మాట్లాడితే నాకు చీరలు, గాజులు పంపిస్తానని అంటున్నారు. ఆమె ఎవరో తెలుసా డైమెండ్. ఓ మహిళా మంత్రి అయ్యుండి. మీరు ఇట్లా మాట్లాడొచ్చా. డైమండ్ రాణి ఆ చీరలు, గాజులు పంపు అవి నా అక్క, చెళ్లెల్లకు పెట్టి వాళ్ల కాళ్లు నేను మొక్కుతా’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-01T12:48:04+05:30 IST