Sunil Deodhar: పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారు

ABN , First Publish Date - 2023-01-31T16:20:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్ల ప్రాజెక్టులు వెనక్కిపోతున్నాయి.’’ అని ఆరోపించారు.

Sunil Deodhar: పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారు
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం

అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. బీజేపీ (bjp)తోనే ఉంటారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దీయోధర్ (Sunil Deodhar) తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ సర్కార్‌ (Ycp government)పై విమర్శలు గుప్పించారు. ‘‘రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఈ ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది... పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు... పెన్షనర్లకు సకాలంలో పింఛన్ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ (Ycp) ల్యాండ్ మాఫియా పార్టీ... మహిళా మంత్రి సంక్షేమం వదిలి భూ కబ్జాలకు పాల్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. గుంటూరులో చంద్రబాబు (Chandrababu) పాల్గొన్న కార్యక్రమంలో మిస్ మేనేజ్‌‌‌మెంట్ వల్ల ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాల్లో అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదు. పన్నులు చెల్లించేవారు హిందువులు... హిందువులు చెల్లించే పన్నుల నుంచి ఆదాయాన్ని చర్చ్‌లో పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు. కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీలకు బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. ప్రత్యేక ప్యాకేజీ (package) ప్రకటించాం. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్ల ప్రాజెక్టులు వెనక్కిపోతున్నాయి.’’ అని ఆరోపించారు.

Updated Date - 2023-01-31T16:20:54+05:30 IST