ఫుల్‌గా తాగి ఇంటికొచ్చిన తండ్రి.. రాత్రి వేళ ఎవరూ ఊహించని విధంగా.. తల్లీకొడుకులు కలిసి..

ABN , First Publish Date - 2022-12-29T19:07:08+05:30 IST

పిల్లలు తప్పు దారిన వెళ్తున్న సమయంలో సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అలాంటిది.. తల్లిదండ్రులే తప్పు చేస్తే ఇక ఆ కుంటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జార్ఖండ్‌లో..

ఫుల్‌గా తాగి ఇంటికొచ్చిన తండ్రి.. రాత్రి వేళ ఎవరూ ఊహించని విధంగా.. తల్లీకొడుకులు కలిసి..

పిల్లలు తప్పు దారిన వెళ్తున్న సమయంలో సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అలాంటిది.. తల్లిదండ్రులే తప్పు చేస్తే ఇక ఆ కుంటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కుటుంబ బాధ్యతలను చూసుకోవాల్సిన తండ్రి.. మద్యానికి బానిసై తప్పుదారి పట్టాడు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు.. చివరకు తల్లితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

జార్ఖండ్ (Jharkhand) రామ్‌గఢ్ జిల్లా కుజు ప్రాంత పరిధి దిగ్వార్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివనారాయణ్ కుష్వాహ (55)కు భార్య, గణేష్ అనే కొడుకు ఉన్నారు. వీరి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేకున్నా.. ఇటీవల శివనారాయణ్ కారణంగా కొత్త సమస్య వచ్చి పడింది. మద్యానికి అలవాటు పడిన (Alcoholic) అతను.. రోజూ తాగొచ్చి, కుటుంబ సభ్యులను విసిగించేవాడు. అలాగే తరచూ భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. కొన్నాళ్లు పోతే మారతాడని భార్య ఓర్పుతో ఎదురు చూసింది. కానీ శివనారాయణ్‌లో మాత్రం మార్పు రాలేదు. రోజు రోజుకూ చిత్రహింసలు (Torture) ఎక్కువ అవడంతో కొడుకు గణేష్‌కు.. తండ్రిపై విరక్తి కలిగింది.

ఆరేళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఓరోజు రాత్రి.. భార్య ఊహించని విధంగా.. ఉన్నట్టుండి భర్త చేసిన పనికి..

crime-trending-news.jpg

అయితే చివరకు ఏ కొడుకూ తీసుకోని సంచలన నిర్ణయం (Sensational decision) తీసుకున్నాడు. తండ్రిని చంపేస్తే సమస్య లేకుండా పోతుందని భావించాడు. ఇదే విషయాన్ని తన తల్లికి కూడా చెప్పాడు. ముందు ఒప్పుకోకపోయినా చివరకు ఆమె కూడా కొడుకు నిర్ణయానికి మద్దతు పలికింది. ఇటీవల ఓ రోజు ఇంటికి ఫుల్‌గా తాగొచ్చిన శివనారాయణ్‌ను.. తల్లీకొడుకులు కలిసి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి, దానికి పెద్ద పెద్ద రాళ్లు కట్టి.. బావిలో పడేశారు.

OYO Room: ప్రియుడిని కలిసిన వివాహిత.. బాత్రూంకు వెళ్లి 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన ప్రేయసికి గదిలో షాకింగ్ సీన్..!

crime-news.jpg

మరుసటి రోజు తన తండ్రి కనపడలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు (Investigate) ప్రారంభించారు. ఈ క్రమంలో బావిలో మృతదేహాన్ని (dead body) గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి.. కుటుంబ సభ్యులను తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చిది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మూడో భర్త వీడియో కాల్ చేయగా.. రెండో భర్తతో కలిసి మాట్లాడిన మహిళ.. రాత్రి ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం..

Updated Date - 2022-12-29T19:08:31+05:30 IST

Read more