Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-12-29T16:37:23+05:30 IST

సాధారణంగా పాములు.. మనిషి అలికిడి వినిపించినా, ఏదైనా చిన్న శబ్ధం చేసినా కంటికి కనిపించకుండా పారిపోతాయి. తెలిసో, తెలీకో వాటి జోలికి వెళ్తే తప్ప దాడి చేసే సాహసం చేయవు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే..

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

సాధారణంగా పాములు.. మనిషి అలికిడి వినిపించినా, ఏదైనా చిన్న శబ్ధం చేసినా కంటికి కనిపించకుండా పారిపోతాయి. తెలిసో, తెలీకో వాటి జోలికి వెళ్తే తప్ప దాడి చేసే సాహసం చేయవు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. చిన్న శబ్ధం చేసినా పారిపోయే పాము.. ఏకంగా తుపాకీ కాల్పులు జరిపినా భయపడలేదు. అంతటితో ఆగిపోకుండా చివరికి ఏం చేసిందో మీరే చూడండి..

Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. కొందరు యువకులు కారులో వెళ్తుండగా.. వారికి రోడ్డు మధ్యలో ఓ నాగు పాము (Cobra) కనిపిస్తుంది. కారు దగ్గరికి వెళ్లగానే సడన్‌గా పడగ విప్పి బుస కొడుతుంది. దీంతో సదరు యువకులు.. పాముపై తుపాకీతో కాల్పులు (Gun firing) జరుపుతారు. మొదటి బుల్లెట్ గురి తప్పుతుంది. అలాగే రెండో బుల్లెట్ కూడా పాము పక్క నుంచి వెళ్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఆరేళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఓరోజు రాత్రి.. భార్య ఊహించని విధంగా.. ఉన్నట్టుండి భర్త చేసిన పనికి..

బుల్లెట్ శబ్ధానికి పారిపోవాల్సిన పాము.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. నా మీదే కాల్పులు జరుపుతావా.. ఉండు! నీ సంగతి చెబుతా.. అన్నట్లుగా, కోపంతో కారు వైపు వేగంగా దూసుకొస్తుంది. ఊహించని ఈ పరిణామానికి సదరు యువకులు.. భయంతో వణికిపోతారు. వామ్మో! ఇది మామూలు పాము కాదురో.. అనుకుంటూ కారు డోర్లు వేసుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

మూడో భర్త వీడియో కాల్ చేయగా.. రెండో భర్తతో కలిసి మాట్లాడిన మహిళ.. రాత్రి ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం..

Updated Date - 2022-12-29T16:37:28+05:30 IST