ఆరేళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఓరోజు రాత్రి.. భార్య ఊహించని విధంగా.. ఉన్నట్టుండి భర్త చేసిన పనికి..

ABN , First Publish Date - 2022-12-28T21:23:04+05:30 IST

ఆమెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మొన్నటి వరకూ ఆమెకు అత్తవారింట్లో ఎలాంటి ఇబ్బందులూ లేవు. భర్త కూడా బాగానే చూసుకునేవాడు. అయితే ఇటీవల ఆమెకు ఊహించని సమస్యలు వచ్చిపడ్డాయి. ఆరేళ్లవుతున్నా పిల్లలు లేకపోవడంతో ..

ఆరేళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఓరోజు రాత్రి.. భార్య ఊహించని విధంగా.. ఉన్నట్టుండి భర్త చేసిన పనికి..
ప్రతీకాత్మక చిత్రం

ఆమెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మొన్నటి వరకూ ఆమెకు అత్తవారింట్లో ఎలాంటి ఇబ్బందులూ లేవు. భర్త కూడా బాగానే చూసుకునేవాడు. అయితే ఇటీవల ఆమెకు ఊహించని సమస్యలు వచ్చిపడ్డాయి. ఆరేళ్లవుతున్నా పిల్లలు లేకపోవడంతో భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇటీవల ఓ రోజు రాత్రి ఊహించని విధంగా ఉన్నట్టుండి అతడు చేసిన పనికి.. భార్యతో పాటూ అత్తమామలు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

The world's most unlucky Groom: పాపం.. పెళ్లి రోజే అందరినీ కోల్పోయాడు.. కుటుంబంలో ముగ్గురే మిగిలారు..!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రవీంద్ర అనే వ్యక్తికి.. గోసాయిగంజ్ ప్రాంతానికి చెందిన యువతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు అత్తమామల విషయంలో ఎలాంటి సమస్యలూ లేవు. అంతా బాగా చూసుకునేవారు. అయితే రాను రాను ఆమెకు భర్త రూపంలో సమస్య వచ్చి పడింది. వీరికి ఆరేళ్లవుతున్నా పిల్లలు లేకపోవడంతో రవీంద్ర తన భార్యపై తరచూ విసుక్కునేవాడు. రాను రాను సూటిపోటి మాటలతో భార్యను (Harassment) వేధించేవాడు. అయినా ఆమె ఎవరికీ చెప్పుకోకుండా అలాగే భరిస్తూ వచ్చింది. అయితే రోజు రోజుకూ భర్త ఆమెను మరింతగా చిత్రహింసలకు గురిచేసేవాడు. గొడవలు ఎక్కువ అవడంతో 8నెలల క్రితం ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు ఆమెను తీసుకురావాలని రవీంద్ర ప్రయత్నించినా... ఆమె మాత్రం అంగీకరించలేదు.

OYO Room: ప్రియుడిని కలిసిన వివాహిత.. బాత్రూంకు వెళ్లి 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన ప్రేయసికి గదిలో షాకింగ్ సీన్..!

ఈ క్రమంలో క్రిస్మస్ (Christmas) సందర్భంగా డిసెంబర్ 25న అతడు తన అత్తగారింటికి వెళ్లాడు. ఇకపై ఇబ్బంది పెట్టనంటూ అందరినీ ఒప్పించి, భార్యను పిలుచుకుని లక్కోకు వచ్చాడు. ఇంటికి వచ్చిన రోజు రాత్రి భార్య పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. అసహజ పద్ధతిలో శృంగారం (Unnatural romance) చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఆమె ఊహించని విధంగా బ్లేడు తీసుకుని, భార్య ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. ఆమె కేకలు విని అత్తమామలు గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. దీంతో రవీంద్ర అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం అయిన ఆమెను.. అత్తమామలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..

Updated Date - 2022-12-28T21:23:11+05:30 IST