మూడో భర్త వీడియో కాల్ చేయగా.. రెండో భర్తతో కలిసి మాట్లాడిన మహిళ.. రాత్రి ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం..

ABN , First Publish Date - 2022-12-29T16:05:54+05:30 IST

ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె.. హిందూ యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత మరో వ్యక్తిని చేసుకుంది. అతడితో కూడా కొన్నాళ్లే కలిసి జీవించింది. ఆ తర్వాత..

మూడో భర్త వీడియో కాల్ చేయగా.. రెండో భర్తతో కలిసి మాట్లాడిన మహిళ.. రాత్రి ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం..

ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె.. హిందూ యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత మరో వ్యక్తిని చేసుకుంది. అతడితో కూడా కొన్నాళ్లే కలిసి జీవించింది. ఆ తర్వాత మరో వ్యక్తిని మూడో వివాహం చేసుకుంది. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు రాత్రి అవుతున్నా భార్య ఇంటికి రాకపోవడంతో.. భర్త వీడియో కాల్ చేశాడు. అయితే అటువైపు నుంచి ఆమె తన రెండో భర్తతో కలిసి మాట్లాడింది. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో కలిసి ఫుల్‌గా మద్యం సేవించింది. ఆ తర్వాత జరిగిన ఘటన.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

OYO Room: ప్రియుడిని కలిసిన వివాహిత.. బాత్రూంకు వెళ్లి 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన ప్రేయసికి గదిలో షాకింగ్ సీన్..!

బీహార్‌లోని (Bihar) సీతాహర్హికి చెందిన బేబీ అనే మహిళ.. కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన యోగేంద్ర అనే హిందూ యువకుడిని ప్రేమించి పెళ్లి (love marriage) చేసుకుంది. తర్వాత తన పేరును అంజలిగా మార్చుకుంది. సుమారు 13సంవత్సరాలు వీరు కలిసి జీవించారు. ఈ క్రమంలో దంపతులకు ఓ పాప కూడా పుట్టింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తర్వాత యోగేంద్రతో విడిపోయింది. ప్రస్తుతం పాప బాగోగులు యోగేంద్ర చూసుకుంటున్నాడు. తర్వాత కొన్ని నెలలకు అంజలికి ఢిల్లీకి చెందిన అనీస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. 2017లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి తన పేరును అఫ్సానాగా మార్చుకుంది. సుమారు ఏడాదిన్నర పాటు వీరిద్దరూ కలిసి జీవించారు. వీరికి అదిల్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆ తర్వాత అనీస్‌తో కూడా విడిపోయింది. ఆ సమయంలో కొడుకు ఆదిల్‌ను తన వెంటే తీసుకెళ్లింది.

అల్లుడి నోట అలాంటి మాటలు విని షాక్‌తో చనిపోయిన అత్త.. కేసు పెట్టిన భార్య.. అసలు కథేంటంటే..!

women'.jpg

అనీస్ నుంచి విడిపోయిన కొన్ని నెలలకు గురుగ్రామ్ నివాసి వినోద్ శర్మతో పరిచయం ఏర్పడింది. 2019లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి అఫ్సానాగా ఉన్న మహిళ కాస్త.. భవ్య శర్మ అని పేరు మార్చుకుంది. వీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్‌ బృందావన్ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నారు. ఇదిలావుండగా, వినోద్ శర్మ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండేవాడు. భవ్య శర్మ డబ్బులతోనే సంసారం గడిచేది. కొడుకు ఆదిల్‌ను స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావడం.. ఇంటి పనులు చూసుకోవడం చేస్తుండేవాడు. ఇక భవ్య శర్మ పని మీద తరచూ బయటి ప్రాంతాలకు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో డిసెంబర్ 24న రాత్రి వినోద్.. తన భార్యకు వీడియో కాల్ (video call) చేశాడు. అయితే తన భార్య రెండో భర్త అనీస్‌తో కలిసి మాట్లాడింది. ఆ సమయంలో అనీస్ మాట్లాడుతూ.. ‘‘నేను నా భార్యను వదిలి ఉండలేనని, నువ్వు తనను విడిచి పెట్టి వెళ్లిపో’’.. అని వినోద్ శర్మతో అన్నాడు.

ఆరేళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఓరోజు రాత్రి.. భార్య ఊహించని విధంగా.. ఉన్నట్టుండి భర్త చేసిన పనికి..

దీంతో వినోద్‌కు కోపం కట్టలు తెంచుకుంది. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. రాత్రి భార్య ఇంటికి రాగానే.. తాను తాగడంతో పాటూ ఆమెకు కూడా ఫుల్‌గా మందు తాపాడు. తర్వాత కొడుకును సరుకులు తీసుకురావడానికి బయటికి పంపించి, భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు.. ఆమెకు ఆపరేషన్ జరిగిన ప్రదేశంలో పొడిచి చంపాడు. తన భార్యకు ఆపరేషన్ చేసిన సమయలో వేసిన కుట్లు దెబ్బతినడంతో చనిపోయిందని.. అందరినీ నమ్మించాలని చూశాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. వినోద్‌పై అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకుని విచారించగా చివరకు నేరం అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..

Updated Date - 2022-12-29T17:28:01+05:30 IST

Read more