Share News

Viral Video: తాబేలు పవర్ ఏంటో తెలీక కొరకబోయిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Mar 28 , 2024 | 06:54 PM

మొసళ్లు ఎంత పవర్‌ఫుల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ జంతువైనా ఒక్కసారి వాటి నోట పడ్డాయంటే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రాణాలతో బయటపడే అవకాశమే ఉండదు. పెద్ద పెద్ద జంతువులను సైతం...

Viral Video: తాబేలు పవర్ ఏంటో తెలీక కొరకబోయిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

మొసళ్లు ఎంత పవర్‌ఫుల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ జంతువైనా ఒక్కసారి వాటి నోట పడ్డాయంటే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రాణాలతో బయటపడే అవకాశమే ఉండదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా నీటిలోకి లాక్కెళ్లే మొసళ్లను తరచూ చూస్తుంటాం. అయితే అలాంటి ఓ భయంకర మొసలి.. తాబేలుకు భయపడిపోయింది. దాని పవర్ ఏంటో తెలీక కొరికేయాలని ప్రయత్నించింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలి (crocodile) నీటి ఒడ్డున ఆహారం కోసం వేచి చూస్తూ ఉంటుంది. అయినా దానికి ఎలాంటి జంతువులూ కంటపడవు. ఇంతలో ఓ తాబేలు అటుగా వస్తుంది. ‘‘ఈ పూటకు ఏదో ఒకటి కానిచ్చేద్దాం’’.. అని అనుకుందే ఏమోగానీ, వెంటనే తాబేలును (turtle) నోట కరుచుకుంటుంది. నోట్లోకి తీసుకుని కొరికేందుకు ప్రయత్నిస్తుంది. అయితే దాన్ని కొరకడం అంత సులభం కాకపోవడంతో ఇబ్బంది పడుతుంది. ఎలాగైనా కొరికేయాలనే ఉద్దేశంతో చాలా సేపు ప్రయత్నిస్తుంది. అయినా తాబేలును కొరకలేకపోతుంది. ఈ క్రమంలో తాబేలు.. మొసలి నోటి నుంచి తప్పించుకుని బయటపడుతుంది.

Viral Video: కారు డిక్కీలో లగేజీ తీసుకెళ్లడం చూశాం కానీ.. ఇతనేంటీ మరీ విచిత్రంగా..

వెంటనే అక్కడి నుంచి నీటిలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. తాబేలు వెళ్లిపోవడాన్ని గమనించినా కూడా మొసలి మిన్నకుండిపోతుంది. ‘‘దీన్ని తినడం నా వల్ల కాదు బాబోయ్’’.. అని అనుకుంటున్నట్లుగా సైలెంట్‍‌గా పడుకుండిపోతుంది. మొసలి నోటి నుంచి బయటపడిన తాబేలు.. మెల్లగా ఎలాగోలా నీటిలోకి చేరుకుంటుంది. మరోవైపు మొసలి మాత్రం కదలకుండా అలాగే పడుకుని ఉంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘మొసలికే షాక్ ఇచ్చిన తాబేలు’’.. అంటూ కొందరు, ‘‘తాబేలు పవర్ ఏంటో బాగా తెలిసినట్టుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి అసహనం మామూలుగా లేదుగా.. అతడి ప్రవర్తన చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Mar 28 , 2024 | 06:54 PM