Share News

Viral: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడి వింత నిర్వాకం.. బాత్రూంలోకి వెళ్లిన యువతికి షాకింగ్ సీన్..

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:02 PM

కొందరు ప్రేమికులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు. కొందరు చుట్టూ ఎవరు ఉన్నారన్న స్పృహ లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు.. అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారు.. అంతలోనే శత్రువులుగా మారుతుంటారు. ఈ క్రమంలో...

Viral: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడి వింత నిర్వాకం.. బాత్రూంలోకి వెళ్లిన యువతికి షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు ప్రేమికులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు. కొందరు చుట్టూ ఎవరు ఉన్నారన్న స్పృహ లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు.. అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారు.. అంతలోనే శత్రువులుగా మారుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రియురాలు బ్రేకప్ చెప్పిందనే కోపంతో ఓ వ్యక్తి వింత నిర్వాకానికి పాల్పడ్డాడు. చివరకు యువతి బాత్రూంలోకి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రేమికులు బ్రేకప్ (Love breakup) చెప్పుకొన్న సందర్భాల్లో ప్రియురాలిని ప్రియుడు అనేక రకాలుగా వేధించడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ప్రేమ జంట కూడా ఇలాగే విడిపోయింది. అయితే ప్రియురాలిపై ప్రియుడు వినూత్న రీతిలో పగ తీర్చుకున్నాడు. ఓ ప్రేమ జంట మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. అయితే ఉన్నట్టుండి వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇది కాస్తా చివరికి బ్రేకప్‌కు దారి తీసింది. ఇటీవల ఓ రోజు రాత్రి యువకుడు తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వారి (Quarrel between lovers) మధ్య మళ్లీ గొడవ మొదలైంది. దీంతో ఆమె చివరకు తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది.

Viral Video: అర్ధనగ్నంగా మారిన ఇద్దరు యువకులు.. హోలీ పేరుతో బైకుపై యువతులను ఎక్కించుకుని మరీ..

lovers-viral-news.jpg

ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు.. ఎలాగైనా ప్రియురాలిపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అందరిలాగా ఆమెపై ఎలాంటి దాడులకు పాల్పడకుండా.. సైలెంట్‌గా బయటికి వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఆమె బాత్రూంలోకి వెళ్లి, కాసేపటి తర్వాత కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి బాత్రూంలోకి వెళ్లి చూడగా.. టాయిలెట్ సింక్‌ను (Toilet sink) పెకలించి ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యం చూసి ఆమె షాక్ అయింది. ఇలా ఎవరైనా చేస్తారా.. అని పేర్కొంటూ.. ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతను స్వతహాగా ప్లంబర్ కావడంతో ఇలాంటి నిర్వాకానికి పాల్పడ్డాడని తెలిపింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా పగ తీర్చుకోవడం ఎన్నడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇతను చాలా వెరైటీగా ఉన్నట్టున్నాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తలకు చున్నీ కట్టుకుని స్కూటీ నడుపుతున్న మహిళ.. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Mar 28 , 2024 | 04:16 PM