Share News

Viral Video: ఇది అలాంటి ఇలాంటి చిలుక కాదు.. డాక్టర్ చిలుక.. నొప్పి లేకుండానే..

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:15 PM

జంతువుల్లో కుక్కలు, కోతులు, పిల్లులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, అచ్చం మనుషుల్లాగే అనుకరించడం చూస్తూనే ఉంటాం. అలాగే కొన్ని పక్షులు కూడా అప్పుడప్పడూ వింతగా ప్రవర్తించడం చూస్తుంటాం. అందులోనూ చిలుకలు మనుషుల్లా పాడడం, మనుషులు చెప్పినట్లు చేయడం చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: ఇది అలాంటి ఇలాంటి చిలుక కాదు.. డాక్టర్ చిలుక.. నొప్పి లేకుండానే..

జంతువుల్లో కుక్కలు, కోతులు, పిల్లులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, అచ్చం మనుషుల్లాగే అనుకరించడం చూస్తూనే ఉంటాం. అలాగే కొన్ని పక్షులు కూడా అప్పుడప్పడూ వింతగా ప్రవర్తించడం చూస్తుంటాం. అందులోనూ చిలుకలు మనుషుల్లా పాడడం, మనుషులు చెప్పినట్లు చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చిలుక డాక్టర్ అవతారం ఎత్తిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిల్లాడికి నొప్పి కలిగించకుండా దంతాన్ని పీకేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడి దంతాల్లో కొన్ని పుచ్చిపోయాయి. దీంతో అతడి తండ్రి డాక్టర్ వద్దకు కాకుండా ఓ చిలుక వద్దకు తీసుకెళ్లాడు. పిల్లాడి నోట్లో పై వరుసలో ఉన్న దంతాల్లో ఓ పండు పుచ్చిపోయి ఉంది. దాన్ని చిలుకకు చూపించగానే.. ‘‘మీరేం వర్రీ అవ్వొద్దు.. ఎలాంటి నొప్పీ లేకుండా పీకేయడానికి నేను ఉన్నాగా’’.. అన్నట్లుగా ముందుకొస్తుంది. నొటిలో పుచ్చిపోయిన పండును బాగా గమనించి, తలను కిందకు పెట్టి తన ముక్కుతో (parrot pulls out boy tooth) దాన్ని ఇలా పట్టుకుని, అలా పీకిపడేసింది.

Viral Video: ఈ 85 ఏళ్ల బామ్మ టాలెంట్ మామూలుగా లేదుగా.. చిటికెలో కేక్ ఎలా చేసిందో చూడండి..

ఎలాంటి నొప్పి లేకుండా పీకడంతో పిల్లాడు కూడా నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. చిలుక పీకేసిన పండును సదరు వ్యక్తి కెమెరాకు చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిలుక టాలెంట్ మామూలుగా లేదుగా’’.., ‘‘ఈ చిలుకతో ఏకంగా ఆస్పత్రి తెరవచ్చు’’.., ‘‘డాక్టర్ కూడా ఇంత ఈజీగా పండును పీకలేడేమో’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బ్యాంక్ సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం.. అనుకోకుండా తుపాకీ ట్రిగ్గర్ నొక్కడంతో.. చివరకు..

Updated Date - Mar 27 , 2024 | 05:20 PM