Share News

Viral Video: ఈ 85 ఏళ్ల బామ్మ టాలెంట్ మామూలుగా లేదుగా.. చిటికెలో కేక్ ఎలా చేసిందో చూడండి..

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:49 PM

టాలెంట్‌కు వయసులో సంబంధం ఉండదు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను బయట పెడుతూ లక్షల ఆదాయం గడించడం చూస్తూనే ఉన్నాం. కొందరు..

Viral Video: ఈ 85 ఏళ్ల బామ్మ టాలెంట్ మామూలుగా లేదుగా.. చిటికెలో కేక్ ఎలా చేసిందో చూడండి..

టాలెంట్‌కు వయసులో సంబంధం ఉండదు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను బయట పెడుతూ లక్షల ఆదాయం గడించడం చూస్తూనే ఉన్నాం. కొందరు మహిళలు ఇంట్లో వంట చేస్తూనే ఆ వీడియోల ద్వారా నేమ్, ఫేమ్‌తో పాటూ ఆదాయం కూడా పొందుతున్నారు. తాజాగా, ఓ 85 ఏళ్ల వృద్ధురాలు వినూత్నంగా వంట చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 90 సెకన్లలో రుచికరమైన కేక్ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. విజయ్ నిశ్చల్ అనే యువకుడికి య్యూటూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో (య్యూటూబ్, ఇన్‌స్టాగ్రామ్‌) లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను తన బామ్మ చేసిన వివిధ రకాల వంటల (Old women cooking videos) వీడియోలు షేర్ చేస్తుంటాడు. తాజాగా, అతడి బామ్మ చేసిన వంట వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎగ్‌లెస్ కేక్ (Eggless cake) తయారీ కోసం వృద్ధురాలు.. కొన్ని రస్క్ ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తుంది.

Viral Video: ఈ కూలర్‌ని చోరీ చేయడం ఎవరి తరమూ కాదేమో.. ఇతడి ముందు జాగ్రత్త మామూలుగా లేదుగా..

తర్వాత అందులో పాలు, చక్కెర, నెయ్యి, పెరుగు, బోర్నవిటా తదితరాలను మిక్స్ చేస్తుంది. చివరగా స్టవ్‌పై పాత్రను వేడి చేసి, దాని మధ్యలో కేక్ మిశ్రమాన్ని ఉంచి మూతపెడుతుంది. కాసేపు తర్వాత తీసి చూడగా రుచికరమైన కేక్ సిద్ధమైంది. కేక్‪‌ను టేస్ట్ చేసిన బామ్మ.. సూపర్ అంటూ సంకేతం ఇస్తుంది. ఈ వృద్ధురాలు చేసిన కేక్ నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఈ వీడియో చూసిన వారంతా కామెంట్లతో బామ్మను అభినందిస్తున్నారు. ‘‘మీరు సూపర్ బామ్మా..’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే తినేయాలనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బ్యాంక్ సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం.. అనుకోకుండా తుపాకీ ట్రిగ్గర్ నొక్కడంతో.. చివరకు..

Updated Date - Mar 27 , 2024 | 02:49 PM