Share News

Viral Video: బ్యాంక్ సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం.. అనుకోకుండా తుపాకీ ట్రిగ్గర్ నొక్కడంతో.. చివరకు..

ABN , Publish Date - Mar 26 , 2024 | 09:45 PM

కొన్నిసార్లు ఊహించని విధంగా చోటు చేసుకునే ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు కొందరు తెలిసి తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట రోజూ చూస్తూనే ఉంటాం. తాజగా

Viral Video: బ్యాంక్ సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం.. అనుకోకుండా తుపాకీ ట్రిగ్గర్ నొక్కడంతో.. చివరకు..

కొన్నిసార్లు ఊహించని విధంగా చోటు చేసుకునే ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు కొందరు తెలిసి తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట రోజూ చూస్తూనే ఉంటాం. తాజగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్యాంకులో విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రమాదవశాత్తు తుపాకీ ట్రిగ్గర్ నొక్కడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కెనరా బ్యాంక్‌లో (Canara Bank) మార్చి 22న ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకుల్లో కస్టమర్లంతా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు (security guard) తుపాకీ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతన్నాడు. ఈ క్రమంలో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఊహించని ప్రమాదం జరిగింది. తుపాకీని తన కాలిపై పెట్టుకుని ఉండగా.. పొరపాటున తనకు తానే ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో పెద్ద శబ్ధంతో దూసుకొచ్చిన బుల్లెట్ అతడి ఎడమకాలిలోకి చొచ్చుకుపోయింది. దీంతో పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుల్లెట్ పాదంలోకి చొచ్చుకుపోవడంతో చూస్తుండగానే తీవ్ర రక్తస్రావం అయింది. నొప్పిని భరించలేక అతను మెల్లగా బ్యాంకు మెయిన్ గేట్ బయటికి వెళ్లి మెట్లపై పడిపోయాడు.

Viral Video: సహచరుడిని కాపాడుకునే క్రమంలో పాముతో బల్లి ఫైట్.. చివరకు ఏమైందో చూడండి..

పక్కన ఉన్న మిగతా సెక్యూరిటీ, బ్యాంకు సిబ్బంది పరుగెత్తుకుంటూ అతడి వద్దకు చేరుకున్నారు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. సెక్యూరిటీ గార్డు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తుపాకీని అజాగ్రత్తగా పట్టుకోవడం వల్లే ఇలా జరిగిందనట్లు తెలిసింది. తుపాకీ బుల్లెట్ ఎవరికీ తాకకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! పెద్ద ప్రమాదం తప్పింది’’.. అంటూ కొందరు, ‘‘ఇంత నిర్లక్ష్యంగా ఉండడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కూలర్‌ని చోరీ చేయడం ఎవరి తరమూ కాదేమో.. ఇతడి ముందు జాగ్రత్త మామూలుగా లేదుగా..

Updated Date - Mar 26 , 2024 | 09:45 PM