Share News

Viral Video: రీల్స్ కోసం నడుస్తూ వస్తున్న మహిళ.. అంతలో ఎదురుగా వెళ్లిన యువకుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Mar 24 , 2024 | 09:35 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వయసు, చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ ఇదే పనిగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు లైక్‌లు, వ్యూస్ కోసం.. చిత్రవిచిత్ర సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే..

Viral Video: రీల్స్ కోసం నడుస్తూ వస్తున్న మహిళ.. అంతలో ఎదురుగా వెళ్లిన యువకుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వయసు, చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ ఇదే పనిగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు లైక్‌లు, వ్యూస్ కోసం.. చిత్రవిచిత్ర సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. మరికొందరు దారుణంగా మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రీల్స్ కోసం రోడ్డుపై నడుస్తూ వస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఇందిరాపురంలో ఓ మహిళ (woman) మార్చి 24న రీల్ (Reel) చేసేందుకు రోడ్డు పైకి వచ్చింది. ఆమె రోడ్డుపై స్టైల్‌గా నడుస్తూ వస్తుంటే.. ఓ వ్యక్తి ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కెమెరా వైపు చూస్తూ నడుస్తూ వస్తున్న మహిళ.. పక్కన ఏం జరుగుతందో కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉంది. ఇదంతా గమనిస్తున్న ఓ బైకర్ (Biker) .. ఇదే మంచి తరుణం అనుకున్నాడో ఏమోగానీ.. నేరుగా బైకుపై ఆమెకు ఎదురుగా వెళ్లాడు.

Viral Video: యువతి రావడం చూసి లిఫ్ట్ ఆపాలని ప్రయత్నించిన వ్యక్తి.. చేయి బయటికి పెట్టగానే షాకింగ్ సీన్.. చివరకు..

మహిళ సమీపానికి వెళ్లిన బైకర్.. ఆమె మెడలోని గొలుసును లాక్కుని చూస్తుండగానే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సదరు మహిళతో పాటూ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా షాక్ అవుతాడు. కాసేపటికి ఈ షాక్ నుంచి కోలుకున్న మహిళ వీడియో తీస్తున్న వ్యక్తితో పాటూ చుట్టు పక్కల వారితో దొంగ గురించి విచారిస్తుంది. తర్వాత ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టైర్లు కొత్తగా కనిపిస్తున్నాయని కొనేస్తున్నారా.. వీళ్ల తెలివితేటలు చూస్తే మతిపోవాల్సిందే..

Updated Date - Mar 24 , 2024 | 09:35 PM