Share News

Viral Video: తలకు చున్నీ కట్టుకుని స్కూటీ నడుపుతున్న మహిళ.. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:06 PM

వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయినా చాలా మంది చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివితో చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: తలకు చున్నీ కట్టుకుని స్కూటీ నడుపుతున్న మహిళ.. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ ట్విస్ట్..

వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయినా చాలా మంది చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివితో చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తలకు చున్నీ కట్టుకుని స్కూటీ నడుపుతోంది. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని (Bangalore) NTI గ్రౌండ్స్ సమీపంలో మార్చి 26న ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తలకు చున్నీ చుట్టుకుని ( woman riding scooty) స్కూటీపై వెళ్తోంది. ఎండాకాలం కావడంతో ఇలా కట్టుకుందని అంతా అనుకున్నారు. అయితే సమీపానికి వెళ్లి చూసిన వారు అవాక్కయ్యారు. ఫోన్‌లో మాట్లాడుతున్న ఆమె.. అది కిందపడకుండా చున్నీ కట్టుకుంది. ఇలా స్కూటీపై వెళ్తూనే ఫోన్‌లో (Phone) మాట్లాడుతోంది.

Viral Video: అర్ధనగ్నంగా మారిన ఇద్దరు యువకులు.. హోలీ పేరుతో బైకుపై యువతులను ఎక్కించుకుని మరీ..

మధ్య మధ్యలో స్కూటీని ఆపుతూ ఉన్నా.. ఫోన్ మాత్రం కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంది. హెల్మెట్ లేకపోవడంతో పాటూ ఇలా వెరైటీగా ఫోన్ మాట్లాడుతుండడం చూసి అంతా ఆసక్తికరంగా చర్చించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Wine: మందుబాబులకు అలెర్ట్.. మీరు తాగుతున్నవి.. టాప్ బ్రాండ్స్ అనుకుంటున్నారా..

Updated Date - Mar 28 , 2024 | 03:08 PM