Share News

Viral Video: రైల్లో టాయిలెట్ గది పక్కనే నిలబడ్డ యువకుడు.. లోపలి నుంచి బయటికొచ్చిన మహిళలు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Mar 27 , 2024 | 07:18 PM

ప్రయాణ సమయాల్లో అజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చూసుంటాం. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించి విలువైన వస్తువులను పొగొట్టుకున్న వారిని కూడా చూస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఊహించని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇలాంటి ..

Viral Video: రైల్లో టాయిలెట్ గది పక్కనే నిలబడ్డ యువకుడు.. లోపలి నుంచి బయటికొచ్చిన మహిళలు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణ సమయాల్లో అజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చూసుంటాం. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించి విలువైన వస్తువులను పొగొట్టుకున్న వారిని కూడా చూస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఊహించని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైలు బోగీలోని టాయిలెట్ వద్ద ఓ యువకుడు పొంచి ఉన్నాడు. ఇంతలో లోపలి నుంచి ఇద్దరు మహిళలు బయటికి వచ్చారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణ భారత దేశంలో మార్చి 13న జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ రైలు బోగీలోని టాయిలెట్ (Train toilet) గది పక్కనే తలుపు వద్ద ఓ యువకుడు నిలబడి ఉంటాడు. ఇంతలో రైలు స్టేషన్ నుంచి కదులుతుంది. అయితే యువకుడు ఎవరి కోసమే వేచి చూస్తున్నట్లుగా అటూ ఇటూ చూస్తుంటాడు. ఇంతలో టాయిలెట్ నుంచి ఇద్దరు మహిళలు (women) నడుచుకుంటూ బయటికి వస్తారు. వాళ్లు బయటికి రావడం చూసి సదరు యువకుడు అలెర్ట్ అవుతాడు.

Viral Video: ఇది అలాంటి ఇలాంటి చిలుక కాదు.. డాక్టర్ చిలుక.. నొప్పి లేకుండానే..

సమీపానికి రాగానే ఒక్కసారిగా ఓ మహిళ మెడలోని గొలుసును లాగుతాడు. చివరకు బలవంతంగా గొలుసు లాక్కుని, తప్పించుకునే క్రమంలో రైలు నుంచి కిందకు దూకేస్తాడు. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో వారు షాక్ అవుతారు. కింద పడిన వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి వారు కూడా ఉంటారా’’.. అంటూ కొందరు, ‘‘కదులుతున్న రైల్లో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రయాణ సమయాల్లో బంగారం ధరించకుంటేనే మంచింది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ 85 ఏళ్ల బామ్మ టాలెంట్ మామూలుగా లేదుగా.. చిటికెలో కేక్ ఎలా చేసిందో చూడండి..

Updated Date - Mar 27 , 2024 | 07:19 PM