Share News

Viral Video: కారు డిక్కీలో లగేజీ తీసుకెళ్లడం చూశాం కానీ.. ఇతనేంటీ మరీ విచిత్రంగా..

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:00 PM

కొందరు తమ వాహనాలను అందరిలా కాకుండా చిత్రచిత్రంగా వినియోగిస్తుంటారు. మరికొందరు తమ పాత వాహనాలను వినూత్నంగా రీమోడలింగ్ చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. తద్వారా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంటారు. ఇలాంటి ..

Viral Video: కారు డిక్కీలో లగేజీ తీసుకెళ్లడం చూశాం కానీ.. ఇతనేంటీ మరీ విచిత్రంగా..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు తమ వాహనాలను అందరిలా కాకుండా చిత్రచిత్రంగా వినియోగిస్తుంటారు. మరికొందరు తమ పాత వాహనాలను వినూత్నంగా రీమోడలింగ్ చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. తద్వారా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కారు డిక్కీని ఇలాక్కూడా ఉపయోగిస్తారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రహదారిపై ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో విశేషం ఏమీ లేకున్నా.. కారులో తరలించిన జంతువును చూసి అంతా అవాక్కవుతున్నారు. కారు వెనుక డిక్కీలో ఏకంగా ఓ పెద్ద ఓంటెను కుక్కేశాడు. ఒంటె అటూ ఇటూ కదలకుండా తాడుతో బంధించి, మెడను మాత్రం బయటికి పెట్టారు. డిక్కీ డోరు మూయడానికి వీలు లేకపోవడంతో తెరిచే ఉంచారు.

Viral Video: తలకు చున్నీ కట్టుకుని స్కూటీ నడుపుతున్న మహిళ.. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ ట్విస్ట్..

ఇలా రోడ్డు మీదకు వచ్చిన కారును చూసి అంతా నోరెళ్లబెట్టారు. కారు డిక్కీ నుంచి తల బయటికి పెట్టిన ఒంటె.. వాహనాలను చూస్తూ హుషారుగా కనిపించింది. ఈ సీన్ చూసిన మిగతా వాహనదారులు పగలబడి నవ్వుకున్నారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ డ్రైవర్ మామూలోడు కాదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘పాపం దీన్ని కబేళాలకు తరలిస్తున్నారేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడి వింత నిర్వాకం.. బాత్రూంలోకి వెళ్లిన యువతికి షాకింగ్ సీన్..

Updated Date - Mar 28 , 2024 | 05:00 PM