Share News

Viral Video: చేపలు ఎలా పట్టాలో ఈ పక్షికి బాగా తెలిసినట్టుంది.. కష్టపడకుండా చిన్న టెక్నిక్‌తో...

ABN , Publish Date - Mar 28 , 2024 | 09:10 PM

చేపలు పట్టడంలో మనుషులు, జంతువుల స్టైల్ విభిన్నంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మనుషులు ఎరలు, వలల ద్వారా చేపలు పడితే.. కొన్ని పక్షులు గాల్లో ఎగురుతూ నీటి పైకి వచ్చిన చేపలను వేటాడుతుంటాయి. అలాగే మరికొన్ని పక్షులు కదలకుండా నటిస్తూ చేపలను వేటాడటం చూస్తుంటాం. అయితే ...

Viral Video: చేపలు ఎలా పట్టాలో ఈ పక్షికి బాగా తెలిసినట్టుంది.. కష్టపడకుండా చిన్న టెక్నిక్‌తో...

చేపలు పట్టడంలో మనుషులు, జంతువుల స్టైల్ విభిన్నంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మనుషులు ఎరలు, వలల ద్వారా చేపలు పడితే.. కొన్ని పక్షులు గాల్లో ఎగురుతూ నీటి పైకి వచ్చిన చేపలను వేటాడుతుంటాయి. అలాగే మరికొన్ని పక్షులు కదలకుండా నటిస్తూ చేపలను వేటాడటం చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే పక్షి మాత్రం ఎంతో స్మార్ట్. మిగతా పక్షుల్లా కాకుండా వెరైటీగా చేపలను పట్టేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది స్మార్ట్ పక్షి గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పక్షికి (bird) చేపలు తినాలని అనిపించింది. అయితే మిగతా పక్షుల్లా గంటలు గంటలు వాటి కోసం వేచి చూసే ఓపిక దీనికి లేనట్టుంది. ప్రస్తుత స్మార్ట్ యుగంలోనూ పాత పద్ధతి ఏంటీ.. అని అనుకుందో ఏమో గానీ.. మనుషులను ఫాలో అయిపోయింది. చేపలకు (fish) ఇష్టమైన ఆహారాన్ని నోట కరుచుకుని నీటి ఒడ్డుకు వెళ్లింది. దాన్ని ఇలా నీళ్లలోకి విసరగానే చేపలన్నీ వాటి కోసం అక్కడికి వచ్చాయి.

Viral Video: ఇలాంటి సింహాన్ని ఎక్కడైనా చూశారా.. ఫొటో తీసేందుకు ఎన్‌క్లోజర్‌లోకి చేయి పెట్టగా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ఇంకేముందీ.. నీటి ఒడ్డుకు వచ్చిన చేపల్లో.. మంచి మంచి చేపలను సెలెక్ట్ చేసుకుని ముక్కుతో లటుక్కున్న పట్టేసుకుని, చటుక్కున్న మింగేసింది. ఇలా ఎలాంటి శ్రమ లేకుండా తెలివిగా ఆలోచించి తన కడుపు నింపుకొంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పక్షి చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ కొందరు, ‘‘మనుషులను చూసి బాగా నేర్చుకుందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తాబేలు పవర్ ఏంటో తెలీక కొరకబోయిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Mar 28 , 2024 | 09:10 PM