Share News

Supreme Court: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:24 PM

Andhrapradesh: స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మంగళవారం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం విచారణ జరిపింది.

Supreme Court: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
TDP Chief Chandrababu Naidu Skill Development Case

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: స్కిల్ కేసులో (Skill Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మంగళవారం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం విచారణ జరిపింది. టీడీపీ చీఫ్‌కు వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ దాఖలు అయినట్లు కోర్టుకు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ తెలిపారు.

RCB: దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం


అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని చంద్రబాబు కొడుకు లోకేష్ బెదిరిస్తున్నారని.. ఆ అంశంపై ఐఏ దాఖలు చేశామని కోర్టుకు న్యాయవాది వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయడం, లేదా చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రసంగాలు చేస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రంజిత్ కుమార్ పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని లోక్‌సభ స్థానాలు వస్తాయో చెప్పిన ఇండియా టీవీ ఒపీనియన్ పోల్


ఉల్లంఘన ఎలా అవుతంది?: సిద్ధార్థ లూథ్రా

అయితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని బాబు తరపు న్యాయవాది సిద్దార్థ లుథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఐఏ దాఖలు చేసినట్లు ప్రభుత్వ తరపు లాయర్ రంజిత్ కుమార్ చెప్పగా.. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏ ఎక్కడుందని న్యాయమూర్తి బేలా ఎం త్రివేదీ ప్రశ్నించారు. ప్రభుత్వ ఐఏ కనిపించకపోవడంతో విచారణను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారన్న రెడ్‌బుక్ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్‌ను లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్‌కు సుప్రీం కోర్టు సూచిస్తూ.. తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

TDP: డామిట్ కథ అడ్డం తిరిగింది.. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా

YS Sharmila: పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఆయన చెప్పిందే చేస్తారు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 16 , 2024 | 05:08 PM