Share News

Viral Video: తాగిన మైకంలో టపాసులతో ఆటలు.. చివరకు తగిన శాస్తి జరిగింది.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:50 PM

నిప్పుతో చెలగాటం ఆడకూడదు. టపాసులు పేల్చేటపుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలిసినా కొందరు హీరోయిజం ప్రదర్శించడం కోసమో, తాగిన మైకంలోనో సాహసాలకు దిగుతుంటారు. టపాసులతో ఆటలాడుతుంటారు. ఏమాత్రం తేడా వచ్చిన పెద్ద ప్రమాదం జరిగి భారీ మూల్యం చెల్లిస్తుంటారు.

Viral Video: తాగిన మైకంలో టపాసులతో ఆటలు.. చివరకు తగిన శాస్తి జరిగింది.. వీడియో వైరల్!
పెళ్లి ఊరేగింపు

నిప్పుతో చెలగాటం ఆడకూడదు. టపాసులు పేల్చేటపుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలిసినా కొందరు హీరోయిజం ప్రదర్శించడం కోసమో, తాగిన మైకంలోనో సాహసాలకు దిగుతుంటారు. టపాసులతో (Fire crackers) ఆటలాడుతుంటారు. ఏమాత్రం తేడా వచ్చిన పెద్ద ప్రమాదం జరిగి భారీ మూల్యం చెల్లిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవకతప్పదు. ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో చేసిన సాహసం అతడిని ప్రమాదానికి గురి చేసింది (Viral Video).


@KARTIKMEENA అనే ట్విటర్ యూజర ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెళ్లి ఊరేగింపు (wedding procession) జరుగుతోంది. రోడ్డుపై టపాసుల బాక్స్ పెట్టి నిప్పు వెలిగించారు. టపాసులు పేలుతున్నాయి. అంతలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చి ఆ టపాసుల బాక్స్‌ను పట్టుకుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. టపాసులు పేలుతుండగా డ్యాన్స్‌లు వేశాడు. కొద్ది సేపటి తర్వాత మంట ఎగిర అతడు వేసుకున్న షర్టులో పడింది. ఆ దెబ్బకు ఆ వ్యక్తి ముందుకు పడిపోయి బాక్స్‌ను కిందపడేశాడు. దీంతో ఆ టపాసులు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి.


ఈ ఘటనను వీడియో తీసిన వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 1.6 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలాంటి వాళ్లే పెళ్లి ఊరేగింపును నాశనం చేస్తారు``, ``అన్నయ్య మద్యం మత్తులో ఉన్నాడు``, ``తగిన శాస్తి జరిగింది``, ``మంచి రిటర్న్ గిఫ్ట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కాకి నుంచి చేపను రక్షించిన కొంగ.. తర్వాత ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!


Puzzle: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. పెన్, పేపర్ లేకుండా ఈ చిన్న పజిల్‌ను 30 సెకెన్లలో సాల్వ్ చేయండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2024 | 04:22 PM