Share News

Viral Video: కాకి నుంచి చేపను రక్షించిన కొంగ.. తర్వాత ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:50 PM

కొన్నిసార్లు మనుషుల కంటే జంతువలు, పక్షులే ఎక్కువ దయతో వ్యవహరిస్తుంటాయి. సాటి జంతువులను అపాయం నుంచి రక్షించేందుకు ముందుకు వస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కొంగ తాను ఆహారంగా తీసుకునే చేపను రక్షించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

Viral Video: కాకి నుంచి చేపను రక్షించిన కొంగ.. తర్వాత ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!
fish

కొన్నిసార్లు మనుషుల కంటే జంతువలు, పక్షులే ఎక్కువ దయతో వ్యవహరిస్తుంటాయి. సాటి జంతువులను అపాయం నుంచి రక్షించేందుకు ముందుకు వస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కొంగ (Stork) తాను ఆహారంగా తీసుకునే చేప (Fish)ను రక్షించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. సంజయ్ కుమార్ అనే డిప్యూటీ కలెక్టర్ కొద్ది రోజుల క్రితం ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చేప నీటి నుంచి బయటకు వచ్చి గిలాగిలా కొట్టుకుంటోంది. ఆ చేపను చూసిన కాకి (Crow) దానిని చంపి తినడానికి ప్రయత్నించింది. అదే సమయంలో ఓ కొంగ అక్కడకు వచ్చింది. ఆ కాకిని తరిమేసింది. తన నోటితో ఆ చేపను పట్టుకుని నది వరకు నడిచి వెళ్లి నీటిలో వదిలేసింది. నీటిలో చేపల కోసం వేటాడుతూ వాటిని తింటూ జీవించే కొంగ.. తన నోటికి చిక్కిన చేపను తినకుండా తిరిగి నీటిలో వదిలివేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ కొంగ గొప్ప మానవతావాది``, ``టైమ్ బాగుంటే మన శత్రువులు కూడా మనకు సహాయం చేస్తారు``, ``ఈ వీడియో చాలా గొప్పగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. పెన్, పేపర్ లేకుండా ఈ చిన్న పజిల్‌ను 30 సెకెన్లలో సాల్వ్ చేయండి..!


Viral Video: ఇది లో బడ్జెట్ ఐపీఎల్.. లోకల్ మ్యాచ్‌లో ఛీర్ గర్ల్ హడావిడి చూడండి.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2024 | 05:36 PM