రాజయ్య ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే... మంత్రి పదవి ఊడిందో తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. రాజయ్యను తొలగిస్తే ఆయన తరఫున తాము మాట్లాడామని గుర్తు చేశారు.
కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ పెట్టిన కొత్త నిబంధనలు పాత కాపులకు షాక్ ఇచ్చింది. మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న నేతలకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. ఐదేళ్ల పార్టీ సభ్యత్వం కూడా మరికొందరికి నిరాశ పరిచింది...
ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని కొండా మురళి ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
నదీ నీటి పంపకాలతోపాటు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఈ తరహా ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ ఆయనకు ఉత్తమ్ సూచించారు.
అధికార కాంగ్రె్‌సలో సంస్థాగత సందడి మొదలైంది. జిల్లా కమిటీల కార్యవర్గాలను ఎంపిక చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడే వారి నుంచి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పార్టీ సంస్థాగత ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అధిష్ఠానం భావిస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి అన్నారు. వరంగల్, కరీంనగర్‌లో మంత్రులు మంత్రులే కొట్టుకుంటున్నారని తెలిపారు.
స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టులో వాదోపవాదాలు జరగగా, తుది తీర్పును గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లతో ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.