ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్‌కి దిగారని గుర్తుచేశారు కవిత.
చర్లపల్లి జైల్లో బిహార్‌కు చెందిన ఠాకూర్‌తో సూరికి పరిచయం అయిందని డీసీపీ తెలిపారు. అతని ద్వారా బిహార్ నుంచి రెండు షార్ట్ వెపన్స్ కొనుగోలు చేశారని తెలిపారు. వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది.
వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.
ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయరా? మరీ ఇంత దారుణమా? రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే పడిగాపులుకాసినా..
హనుమకొండలో ఉద్రిక్తత నెలకొంది.. GWMC కమిషనర్, మేయర్ వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.
గొర్రెల యజమాని మేడిపల్లి రామయ్య సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన జంతువు పాదముద్రలు గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు.
హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనతో హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.